ఏపీ రాజకీయాలపైన బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఏపీలో వేగంగా పరిణామాలు మారిపోతుండటంతో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఓవైపు అధికార పార్టీ వైసీపీ దూకుడు, మరోవైపు ప్రతిపక్ష టీడీపీ, జనసేన చెలిమి వార్తలు బీజేపీ అధిష్టానాన్ని కలవరపరుస్తున్నాయని టాక్. అదేవిధంగా ఏపీ బీజేపీ నేతలు వేరే పార్టీల వైపు చూస్తుండటంతో అధిష్టానం నేరుగా రంగంలోకి దిగిందని సమాచారం.
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వంటివారు వేరే పార్టీల వైపు చూస్తున్నారని టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఏపీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి బీజేపీ అధిష్టానం ఏపీ విషయాలపై ఆరా తీస్తోంది.
ఇందులో భాగంగా కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ ప్రకాష్ జీ ఫోన్ చేశారని చెబుతున్నారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలు, సోము వీర్రాజుపై కన్నా విమర్శలు, జనసేన, టీడీపీ పొత్తు వార్తలు తదితరాలపై కన్నా లక్ష్మీనారాయణను ఆరా తీసినట్టు తెలుస్తోంది.
ఈ సందర్బంగా కన్నా లక్ష్మీనారాయణ తాను పార్టీ మారడం లేదని.. మీడియానే కావాలని తనను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తోందని శివ ప్రకాష్ జీ దృష్టికి తెచ్చినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 27న తనతో విజయవాడలో భేటీ కావాలని శివ ప్రకాష్ జీ.. కన్నా లక్ష్మీనారాయణకు సూచించినట్టు సమాచారం.
ఈ సమావేశంలో ఇటీవల కాలంలో బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిమాణాలను కన్నా వివరిస్తారని అంటున్నారు. అలాగే తనతోపాటు పార్టీలోకి వచ్చిన 8 మందిని జిల్లా అధ్యక్షులుగా తొలగించిన వైనాన్ని, తనకు కనీసం ఒక్కమాట చెప్పలేదనే విషయాన్ని శివప్రకాష్ జీకి కన్నా లక్ష్మీనారాయణ చెబుతారని అంటున్నారు.
ఇదే సమయంలో ప్రధానంగా జనసేన–టీడీపీ పొత్తు వ్యవహారంపైనా శివ ప్రకాష్ జీ ఆరా తీస్తారని పేర్కొంటున్నారు. బీజేపీతో ప్రస్తుతం తాను పొత్తులో ఉన్నామని పవన్ చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడలో పవన్ ఇవే వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వద్దనుకుంటే వేరే పార్టీలతో అయినా పొత్తు పెట్టుకుని వెళ్తామని పవన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పొత్తు విషయంపై కూడా శివ ప్రకాష్, కన్నా భేటీలో చర్చించవచ్చని చెబుతున్నారు.
2014లో పోటీ చేసినట్టు జనసేన–టీడీపీ–బీజేపీ కలసి పోటీ చేయాలనేది పవన్ ఉద్దేశమని అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం తాము వైసీపీ, టీడీపీలకు దూరమని చెబుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని చెబుతున్న పవన్.. టీడీపీ తమ కూటమిలో లేకుండా బీజేపీతో కలసి వెళ్తారని భావించలేమని అంటున్నారు. ఈ నేపథ్యంలో పొత్తుల వ్యవహారంపైనా శివ ప్రకాష్ జీ దృష్టి సారించవ్చని సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.