ఆయనను మేం గెలిపిస్తాం: వైసీపీ తీర్మానం ..!
మిగిలిన రెండు మాట ఎలా ఉన్నా.. ఉమ్మడిఉభయ గోదావరి జిల్లాల నుంచి పట్టభద్ర ఎమ్మె ల్సీగా పోటీ చేస్తున్న టీడీపీ నాయకుడు.. పేరాబత్తుల రాజశేఖరం కుషీ అవుతున్నారు.
రాజకీయాల్లో ఒక్కొక్కసారి చిత్రాలు చోటు చేసుకుంటాయి. ఇవి ఎందుకు? ఏంటి? అనే ప్రశ్నలు ఉండ వు. జరుగుతాయి అంతే! అలాంటి ఘటనే ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ చోటు చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒకటి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం కాగా.. మిగిలిన రెండు కూడా.. పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలు.
1) ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు.
2) ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్నాజిల్లాల పరిధిలోనూ జరుగుతున్నాయి.
అయితే.. మిగిలిన రెండు మాట ఎలా ఉన్నా.. ఉమ్మడిఉభయ గోదావరి జిల్లాల నుంచి పట్టభద్ర ఎమ్మె ల్సీగా పోటీ చేస్తున్న టీడీపీ నాయకుడు.. పేరాబత్తుల రాజశేఖరం కుషీ అవుతున్నారు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి.
కూటమి పార్టీలు కలిసి కట్టుగా పేరాబత్తులకు మద్దతు ఇస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలు ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా పేరాబత్తుల అందరివాడు అన్నట్టుగా నాయకులు కలిసి వస్తున్నారు. తాజాగా ఆయన వేసిన నామినేషన్ పర్వం.. పెద్ద పండుగగా నిర్వహించడం గమనార్హం.
దీంతో తన గెలుపు పక్కా అని పేరాబత్తుల నిర్ణయించుకున్నారు. దీనికి మరింత దన్నుగా.. ఆయన అంతర్గత మద్దతు కూడా లభిస్తోంది. వైసీపీలోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గతంగా చర్చించుకుని.. పేరాబత్తుల విజయానికి కృషి చేయాలని తీర్మానం చేసుకున్నారు. వ్యక్తిగతంగా తమకు కూడా పేరాబత్తుల కావాల్సిన వాడేనని వారు చెబుతున్నారు. వీరిలో మాజీ మంత్రి ఒకరు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పేరు బయటకు రాకపోయినా.. ఈయన జగన్‌కు కూడా సన్నిహితుడేనని అంటున్నారు.
ఆయన కనుసన్నల్లోనే.. వైసీపీ కూడా రాజకీయాలకు అతీతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో తాము సహకరిస్తామని పేరాబత్తులకు హామీ ఇచ్చారని సమాచారం. ఈ క్రమంలో వారు కొన్ని షరతులు కూడా పెట్టారని.. వాటికి కూటమి నేతలు కూడా ఓకే చెప్పారని అంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని అక్రమ ఇసుక కేసులు .. నిన్న మొన్నటి వరకు.. తెరమీదికి వచ్చినా.. ఆ వెంటనే మాయమయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రాజకీయాల్లో ఇలాంటి చిత్రాలు కామనేని అంటున్నారు పరిశీలకులు.