యూపీలో బీజేపీ సునామీ..అక్కడ కాంగ్రెస్ హవా

Update: 2017-03-11 06:25 GMT
కాంగ్రెస్ - బీజేపీల‌కు అనూహ్య ఫ‌లితాలు వ‌చ్చాయి. ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. స్పష్టమైన ఆధిక్యాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో బీజేపీ 285 స్థానాల్లో లీడింగ్ ఉంది. 202 మ్యాజిక్ ఫిగర్‌ ను కమలం దాటేసింది. ఎస్పీ 66 - కాంగ్రెస్ 13 - బీఎస్పీ 28 స్థానాల్లో ఉంది. బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తున్నది. యూపీ వ్యాప్తంగా కమలనాథుల సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ కార్యాలయాల వద్ద ఆ పార్టీ నేతలు - కార్యకర్తలు బాణాసంచా కాల్చి - స్వీట్లు పంచుకుంటున్నారు.

మ‌రోవైపు గోవాలో కాంగ్రెస్ దూసుకెళ్తున్నది. బీజేపీ ద్వితీయ స్థానంలో ఉంది. కాంగ్రెస్ 8 స్థానాల్లో ముందంజలో ఉండగా, బీజేపీ 5, ఇతరులు 3 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ మాడ్రేమ్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. డిప్యూటీ సీఎం - బీజేపీ అభ్యర్థి ఫ్రాన్సిస్ డిసౌజా మపూస నియోజకవర్గం నుంచి ముందంజలో ఉన్నారు. 40 స్థానాలున్న గోవాలో మ్యాజిక్ ఫిగర్ 21. కాగా గోవాలో 2012 ఫలితాలను పరిశీలిస్తే.. బీజేపీ 21, గోవా వికాస్ పార్టీ 2 - కాంగ్రెస్ 9 - మహారాష్ట్రవాడీ గోమంతక్ 3, ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు.

మరోవైపు ప‌ంజాబ్‌ లో కాంగ్రెస్ దూసుకెళ్తున్న‌ది. ప్ర‌స్తుతం 60 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. శిరోమ‌ణి అకాలీద‌ళ్‌ - బీజేపీ కూట‌మి 29 స్థానాల్లో - ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతున్నాయి. 59 స్థానాలు గెలిస్తే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంటుంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న న‌వ్‌ జ్యోత్ సింగ్ సిద్దూ అమృత్‌ స‌ర్ ఈస్ట్ నుంచి ఆధిక్యంలో ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News