ఏపీని కుదిపేస్తున్న విశాఖ భూ కుంభకోణంపై వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తాజాగా డిమాండ్ చేశారు. భూ కబ్జాలపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించడం హర్షణీయమని... నేతలంతా అయ్యన్నపాత్రుడిలా ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేదని ఆయన టీడీపీ నేతలపై సెటైర్లు వేశారు. ముదపాక భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు, కొందరు తననే బెదిరించారని ఎమ్మెల్యే తెలిపారు. తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టేందుకు కూడా కుట్ర పన్నారని చెప్పారు. అయితే, తాను ఎలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని అన్నారు.
ఇదే సమయంలో ఆయన విజయవాడ ఎంపీ కేశినేని నానికి సవాల్ విసిరారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నందు వల్లే మెజార్టీ తగ్గిందని కేశినేని నాని చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని ఆయనకు సూచించారు. ప్రజల్లోకి వెళ్తే ఎవరిది బలుపో? ఎవరిది వాపో? తేలిపోతుందని ఎద్దేవా చేశారు. నాని స్థానంలో తానుంటే రాజీనామా చేసేవాడినని చెప్పారు.
గత ఎన్నికల్లో బీజేపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతిచ్చారని... ఆయనను గుర్తుంచుకుంటామని చెప్పారు. తాము ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే రకం కాదని అన్నారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదాపై సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఏపీకి తమ పార్టీ హోదాకు మించిన ప్యాకేజీని కల్పించిందని చెప్పారు. పవన్ హోదానే పట్టుకుని వేలాడుతున్నారని విమర్శించారు. 2014లో పవన్ తమకు సహకరించారని, 2019వరకు ఆయనను గుర్తుంచుకుంటామని వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/