ఆపరేషన్ కర్ణాటకను ఏదోలా పూర్తి చేసి తాము కోరుకున్నట్లుగా కన్నడ నాట కాషాయజెండా ఎగురవేయాలని తపిస్తున్న మోడీషాలకు ఊహించని రీతిలో షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. తమ పార్టీ నేతల్ని రంగంలోకి దించి బెంగళూరు నుంచి మంబయి వరకూ ప్రత్యేక చాపర్స్ లో తరలించినా.. ఇష్యూ క్లోజ్ కాకపోవటం తర్వాత.. మరింత చిక్కుముడులు పడుతున్న పరిస్థితి.
తాజాగా రెబల్ ఎమ్మెల్యేల విషయంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించి.. వారి రాజీనామాల్ని ఆమోదించొద్దని.. అనర్హత వేటు వేయొద్దని చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే.. తొలుత అనుకున్న ప్లాన్ కు భిన్నంగా మోడీషాలు ఇప్పుడు మరో కొత్త ఎత్తును తెర మీదకు తెచ్చారని చెబుతున్నారు. కర్ణాటక ఎపిసోడ్ లో బీజేపీ భారీగా డ్యామేజ్ అయ్యిందన్న అభిప్రాయం నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేసినా.. ఉప ఎన్నికల్లో గెలిపించుకుంటామా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఒకవేళ లెక్క తేడా వచ్చి.. బీజేపీ ఎమ్మెల్యేలు ఓడిపోతే పరువు పోవటం కర్ణాటక వరకే పరిమితం కాక.. దేశవ్యాప్తంగా కొత్త సవాళ్లు ఎదురవుతాయి. తమకు తిరుగులేని రీతిలో పరిస్థితి ఉన్నప్పుడు చేజేతులారా ప్రత్యర్థులకు నైతిక స్థైర్యం పెరిగేలా అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదన్న ఆలోచనలో ఉన్నమోడీషాలు కర్నాటక సంక్షోభానికి బిహార్ మెడిసిన్ వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
బిహార్ లో కనుక లాలూ.. జేడీయూ సంకీర్ణ ప్రభుత్వానికి ఎలా అయితే గండి కొట్టి.. లాలూను బయటకు పంపి తాము నితీశ్ పక్క చేరామో.. ఇప్పుడు అదే విధానాన్ని కర్ణాటకలో అమలు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. పవర్ పోతుందన్న దిగులులో ఉన్న కుమారస్వామి తెప్పరిల్లేలా చేసి.. కొత్త ఆశలు కల్పిస్తూ.. తమతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరటం ద్వారా కర్నాటక కథను ఒక కొలిక్కి తేవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
అదే జరిగితే పులుసులో మునక్కాయ అయ్యేది కాంగ్రెస్సే తప్పించి జేడీయూ కాదు. పోతుందనుకున్న అధికారం పోదు సరికదా.. తమతో ఉన్న నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలు జారిపోరన్న విషయం తమకే లాభం కలుగుతుందన్న ఆలోచనను కుమారస్వామికి ఇప్పటికే కలుగజేశారంటున్నారు. ఈ కారణంతోనే సీఎం పదవికి రాజీనామా చేయాలని భావించిన ఆయన తర్వాత తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటం వెనుక ఉన్న అసలు సంగతి ఇదేనని చెబుతున్నారు.
కర్ణాటక ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చేందుకు ఇప్పటికే మురళీధర్ రావు లాంటివాళ్లను పంపిన బీజేపీ అధినాయకత్వం కుమారస్వామిని ఒప్పించే టాస్క్ లో ఇప్పుడు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మోడీషాలు అనుకున్నట్లు కుమారస్వామి ఓకే అయితే.. బిహార్ ఫార్ములాను కర్ణాటకలో సక్సెస్ ఫుల్ గా అమలు చేసినట్లు అవుతుందని చెప్పక తప్పదు. మరి.. కుమారస్వామి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.