కమల విలాపం మొదలైంది.. దేశంలో ప్రబలంగా వికసించిన తామరం వాడిపోతోంది. కేవలం ఒక్క ఏడాది.. 12 నెలల కాలం.. దేశంలోని కీలకమైన ఐదు రాష్ట్రాలు బీజేపీ చేజారిపోయాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ లలో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. ఆరు నెలల కిందటే బీజేపీని అఖండ మెజార్టీతో గద్దెనెక్కించిన ప్రజలు ఇప్పుడెందుకు ఓడించారు. ఆరు నెలల్లోనే దేశ ప్రజల దృష్టిలో బీజేపీపై కోపం ఎందుకొచ్చింది.? అంటే స్థానిక అంశాలు, మారిన బీజేపీ వైఖరి అని చెప్పక తప్పదు.
*హిందుత్వ పోకడ చేటు తెచ్చిందా?
ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ, అయోధ్య సానుకూల వైఖరి, ఇప్పుడు ఎన్నార్సీ ఇవన్నీ హిందుత్వ ఎజెండాను బీజేపీ తలకెత్తుకుందని అన్ని వర్గాల్లోనూ అసంతృప్తికి కారణమైంది. దళితులు, మైనార్టీలు, బహుజనులు బీజేపీకి దూరమయ్యారు. ఇవన్నీ ప్రచారం చేసినా జార్ఖండ్ లో ప్రజలు ఓడించారు. జాతీయవాదాన్ని తిరస్కరించారు.
*స్థానికులకు అధికారం ఇవ్వని బీజేపీ
బీజేపీ ఆయా రాష్ట్రాల్లో బలమైన వారిని పక్కనపెట్టడం.. అధికారం ఇవ్వకపోవడం ఆ పార్టీ పుట్టి ముంచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలో మరాఠాలు, రాజస్థాన్ లో జాట్ లు, జార్ఖండ్ లో గిరిజనులను విస్మరించిన బీజేపీ నాన్-మరాఠా, నాన్-జాట్, నాన్- గిరిజన వర్గాలకు అధికారం కట్టబెట్టడం, అలాగే వ్యవహరించడం కూడా ఆయా వర్గాల్లో ఆగ్రహానికి కారణమైనట్టు చెబుతున్నారు. అదే బీజేపీ ఓటమికి కారణమైందని చెబుతున్నారు.
జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా జార్ఖండ్ లో సాగిన భూపోరాటాలే ఆయనను విజయ తీరాలకు చేర్చాయి. దేశంలోనే అత్యధిక గిరిజనులు ఉన్న రాష్ట్రం జార్ఖండ్. వారినే బీజేపీ ఇక్కడ విస్మరించింది. గిరిజనుల హక్కులను కాపాడే పోరాటంలో హేమంత్ ముందుండి పోరాడారు. 2016లో గిరిజనుల భూములను కంపెనీలకు ధారదత్తం చేసేందుకు బీజేపీ సర్కారు చట్టం తేగా.. దానికి వ్యతిరేకంగా భూమి హక్కుల పోరాటాన్ని పెద్ద ఉద్యమంగా హేమంత్ మలిచారు. లక్షలాది మంది గిరిజనులతో రోడ్డెక్కి హేమంత్ నిరసనలు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం భూచట్టాలను మార్చి కార్పొరేట్లకు బార్లా తెరిచి గిరిజనులను ముంచుతోందన్న హేమంత్ మాటలను జనాలు నమ్మారు. దీంతో ఈసారి హేమంత్ కూటమినే ప్రజలు గెలిపించారు. గిరిజన హక్కుల కోసం పోరాడిన హేమంత్ నే కాంగ్రెస్, ఆర్జేడీలు సీఎం అభ్యర్థిగా ప్రకటించాయి. బీజేపీ గిరిజనుల పట్టించుకోకుండా అధికారం కోల్పోయింది.
*లోకల్ పార్టీలను తొక్కేద్దామనుకున్న బీజేపీనే తొక్కేశారు
దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు పెట్టి లోకల్ పార్టీలను తొక్కేద్దామని బీజేపీ కలలుగంటోంది. ఆ విధంగానే రాజకీయం మొదలుపెట్టింది. రాష్ట్రాల్లో స్థానిక పార్టీలను పట్టించుకోకుండా సొంతంగా ముందుకెళ్లింది. అదే బీజేపీ అపజయానికి నాంది పలుకుతోంది. లోకల్ పార్టీలను తొక్కుతూ అదే విధంగా సామాజికవర్గాలను తొక్కుతూ రాజకీయం చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తే జనాలు, చిన్న పార్టీలు బీజేపీనే తొక్కేసిన పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. జార్ఖండ్ లో ఐదేళ్లపాటు బీజేపీ ప్రభుత్వంలో కలిసున్న ఏజేఎస్యూను ఎన్నికల వేళ బీజేపీ దూరం పెట్టడం దుమారం రేపింది. పొరుగురాష్ట్రం బీహార్లో మిత్రపక్షాలుగా ఉన్న జేడీయూ, ఎల్జేపీని కూడా జార్ఖండ్ లో కలుపుకోకుండా బీజేపీ బీరాలకు పోయింది. అవే పార్టీలు జార్ఖండ్ లో బీజేపీని చిత్తు చేసి ఆకాశంలో ఉన్న బీజేపీని నేలకుదించాయి.
మొత్తంగా దేశంలో గెలిచామన్న అతివిశ్వాసం.. దేశంలో బీజేపీ తప్ప వేరే పార్టీలు ఉండద్దని చేస్తున్న రాజకీయం, స్థానిక పార్టీలను, సామాజికవర్గాలను తొక్కేయాలని చూసిన బీజేపీనే జనాలు తొక్కేశారు. దేశంలో బీజేపీ మాత్రమే ఉండాలి.. ఇతర స్థానిక పార్టీలు ఉండకూడదన్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎల్లకాలం తమదే రాజకీయం అధికారమని విర్రవీగిన బీజేపీకి కార్రుకాచి వాతపెట్టారంటున్నారు.. మరి ఇప్పటికైనా బీజేపీ సెట్ రైట్ అవుతుందా లేదా అన్నది వేచిచూడాలి.