నాకీ రాజకీయాలు వద్దు అని మెగాస్టార్ చిరంజీవి చెప్పేసుకున్నారు. తనకు సినిమాలే ఇష్టమని ఒట్టేసుకుని మరీ అక్కడే ఆయన సెటిల్ అయిపోయారు. తనకు ఓపిక ఉన్నంతవరకూ హ్యాపీగా సినిమాలు చేసుకోవాలని ఆయన ఆలోచన. అయితే చిరంజీవిని ఎలాగైనా రాజకీయాలలోకి లాగాలని ఈ రోజు దాకా ప్రయత్నం చేయని పార్టీ లేదు. ఆయనను తన వద్దకు తీసుకురావాలని ఆ మధ్యన రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలకు పురమాయించారు. కానీ చిరంజీవి నుంచి నో రెస్పాన్స్.
ఇక ఆ మధ్యన మెగాస్టార్ జగన్ తో సమావేశమైనపుడు కూడా చాలా రకాలైన ప్రచారం సాగింది. రాజ్యసభ సీటు ఆయనకు ఇస్తారని కూడా ఊహాగానాలు చెలరేగాయి. వచ్చే ఎన్నికల్లో మెగాస్టార్ వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారని కూడా కధలు వినిపించాయి. వాటిని కొట్టిపారేస్తూ చిరంజీవి నేరుగా మీడియాకే ఒక క్లారిటీ ఇచ్చేశారు. తనకు పదవుల మీద ఆశలు లేవని, తాను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సమస్యే లేదని చెప్పేశారు.
ఇక బీజేపీ విషయం చూస్తే ఎలాగైనా చిరంజీవిని తమ వైపు లాగాలన్న తాపత్రయం కనబడుతోంది. ప్రజారాజ్యం పార్టీని పెట్టి రెండు ధీటైన పార్టీల మధ్య పోటీకి నిలబడి డెబ్బై లక్షల ఓట్లు 18 ఎమ్మెల్యే సీట్లు సాధించి 18 శాతానికి పైగా ఓటు బ్యాంక్ ని తెచ్చుకున్న చిరంజీవి సామాన్యుడు కాడు అని బీజేపీ భావిస్తోంది. ఆయనకు సరైన రాజకీయ వ్యూహాలు లేకపోవడం వల్ల ఓటమి పాలు అయ్యారు తప్ప ఆయన పవర్ కి లోటు లేదని ఇక ఆయన అండ ఉంటే బీజేపీ లాంటి పార్టీలకు రాజకీయం ఏపీలో చేయడం చాలా ఈజీ అని కూడా తలపోస్తోంది.
మరి ఏ కారణాలు మనసులో పెట్టుకున్నారో మరేమో తెలియదు కానీ మెగాస్టార్ ని ప్రధాని మోడీతో కలిపే కార్యక్రమం అయితే రెడీ అయింది. ప్రధాని మోడీ జూలై 4న భీమవరంలో జరిగే విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఆ వేడుకలలో పాల్గొనాలని చిరంజీవికి ఆహ్వానం అందింది. అది కూడా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి పంపించారు.
అంటే ఒక విధంగా మెగాస్టార్ మోదీ కలసి పాలు పంచుకునే తొలి వేదిక ఇదే అవుతుంది అన్న మాట. ఈ సందర్భంగా మోడీ ఎలాగూ మెగాస్టార్ తో మాట్లాడుతారు. అలా మెల్లగా ముగ్గులోకి దింపి ఏపీ బీజేపీకి అతి పెద్ద అండగా చిరంజీవిని చేసుకోవాలని బీజేపీ చూస్తోందని కధనాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కనుక తమతో కలసివస్తే కచ్చితంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆయన జనసేనతో కూడా తోడు ఉంటుంది కాబట్టి ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా అవతరించవచ్చు అన్నదే బీజేపీ మాస్టర్ ప్లాన్.
అల్లూరి 125వ జయంతి అంటే కచ్చితంగా మెగాస్టార్ వస్తారు. ఎందుకంటే ఒక దేశ భక్తుడి కార్యక్రమంలో పాల్గొనడం విధిగానే భావిస్తారు. ఇక ప్రధాని మోడీ వంటి వారి నుంచి ఆహ్వానం కాబట్టి దాన్ని గౌరవంగా స్వీకరిస్తారు అని అంటున్నారు. అయితే రాజకీయాల విషయం వస్తే మాత్రం నో అని చిరంజీవి సున్నితంగా తిరస్కరిస్తారు అనే అంటున్నారు. ఆయన రాజకీయాల మీద పూర్తిగా అనాసక్తిగా ఉంటున్నారు. ఆయన కనుక తలచుకుంటే జనసేనలోనే ముఖ్య భూమిక పోషించేవారు కదా. ఈ చిన్న లాజిక్ ని మరచి ఎవరి ఆశలు వారివి అన్నట్లుగా అంతా ప్రయత్నం చేస్తున్నారు.
తనకు ఇష్టం లేని రంగానికి తాను వద్దు అనుకున్న దానిలోకి చిరంజీవిని ఆహ్వానించడం ద్వారా వారు తప్పు చేస్తున్నారా ఒప్పు చేస్తున్నారా అన్నది పక్కన పెడితే మెగాస్టార్ ని మాత్రం ఇబ్బంది పెడుతున్నారు అనే అనుకోవాలి. ఈ జన్మకు సినిమాలకే తాను అంకితం అని చిరంజీవి భావిస్తున్నారు. సో ఆయన మోడీ సభలో కనిపించినా రాజకీయ రీ ఎంట్రీ ఉంటుందని ఎవరూ అనుకోవడానికి అసలు వీలు లేదు అనే అంటున్నారు. చూడాలి మరి బీజేపీ మ్యాజిక్ చిరంజీవి మీద ఎలా పనిచేస్తుందో ఏమిటో.