కేంద్రంలో - రాష్ట్రంలో అధికారంలో ఉంది.. ఇకేం.. తనకు పట్టాపగ్గాలు లేవనుకున్నాడు ఈ బీజేపీ ఎమ్మెల్యే.. ఇదో తన రాజ్యం అన్నట్టు.. తాను రాజైనట్టు మాట్లాడాడు. స్వతంత్ర భారతంలో అమ్మాయిలను అంగడి పశువుగా మార్చేశాడు... అబ్బాయి ప్రేమని అమ్మాయి కనుక తిరస్కరిస్తే.. అలాంటి అమ్మాయిల్ని కిడ్నాప్ చేసైనా సరే.. సదురు పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేస్తాననని అభయమిచ్చాడు మహారాష్ట్రలోని గటోకోపర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్ కదం. ఈయన చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా దుమారం రేపాయి..
బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తున్న కామెంట్లు - వ్యవహారశైలిలు శృతిమించిపోతున్నాయి. హిట్లర్ లా ప్రవర్తిస్తున్నారనే విమర్శలున్నాయి. హిందుత్వ ముసుగులో బీజేపీ నేతలు చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావు.. ఇప్పుడు ఏకంగా సదురు బీజేపీ ఎమ్మెల్యే.. తనకు ఏ సమయంలోనైనా కాల్ చేస్తే చాలు అని.. రిజెక్ట్ చేసిన అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి సదురు కుర్రాడితో పెళ్లి చేయిస్తానని భరోసానిస్తున్నాడు. అంతేకాదు.. ఈ ఎమ్మెల్యే తన ఫోన్ నంబర్ ను బహిరంగంగా ప్రకటించడం దుమారం రేపింది.
ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో బీజేపీ ఇరుకునపడింది. అధిష్టానం ఆ ఎమ్మెల్యేకు చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. అమ్మాయిలను కిడ్నాప్ చేస్తాననుంటున్న ఎమ్మెల్యేపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు - మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.