ఉత్త‌రాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Update: 2018-05-28 04:26 GMT
మామూలుగా మాట్లాడితే వారు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు అవుతారు. మ‌త‌స‌హ‌నం అన్న‌ది మ‌ర్చిపోతూ.. త‌ర‌చూ వివాదాల్లో మునిగిపోతున్న కొంద‌రు బీజేపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు కొత్త స‌మ‌స్య‌ల్ని తెర మీద‌కు తెస్తున్నాయి. తాజాగా ఉత్త‌రాఖండ్‌ కు చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు వికారంగా ఉండ‌ట‌మే కాదు.. ఇదేం పోయే కాలం అన్న మాట చ‌ప్పున మ‌న‌సులోకి రావ‌టం ఖాయం.

ఉత్త‌రాఖండ్‌ కు చెందిన రుద్రాపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ తుక్రాల్ కొత్త త‌ర‌హా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మ‌త స‌హ‌నం అన్న‌ది లేకుండా.. త‌న మాట‌ల‌తో ఉన్న స‌హృద్భావ వాతావ‌ర‌ణాన్ని పూర్తిగా చెడ‌గొట్టేలా ఆయ‌న మాట‌లు ఉన్నాయి. మేం వారి మ‌సీదుల‌కు వెళ్ల‌న‌ప్పుడు.. ముస్లింలు ఎందుకు మా దేవాల‌యాలు సంద‌ర్శించాలి? అంటూ ఘాటు వ్యాఖ్య‌ను చేశారు.

ముస్లింల దేవాల‌యాల సంద‌ర్శ‌న‌లో వారి ల‌క్ష్యం ఏమిటి?  అంటూ ద‌రిద్ర‌పుగొట్టు సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. దేవాల‌యాల విష‌యంలో ముస్లింల ల‌క్ష్యం ఏమిటో చెప్పాల‌ని.. దేవాల‌యాల సంద‌ర్శ‌న ద్వారా ఆల‌యాల్ని ఆవ‌మానిస్తున్నారంటూ ఎమ్మెల్యే తుక్రాల్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

తాజాగా తుక్రాల్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాంన‌గ‌ర్ లోని గ‌ర్జియాదేవి ఆల‌యానికి ఒక ముస్లిం వ‌చ్చారు. అత‌డ్ని అడ్డుకున్న స్థానికులు దాడికి ప్ర‌య‌త్నించారు. ఇదే స‌మ‌యంలో స్థానిక ఎస్ ఐ అత‌డ్ని కాపాడారు. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే తుక్రాల్ నోరు పారేసుకున్నారు. ఆయ‌న తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేసే పార్టీ ఎమ్మెల్యేల‌కు చెక్ చెప్ప‌టంతో పాటు..అలాంటి వ్యాఖ్య‌లు చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో మోడీషాలు మ‌రింత చురుగ్గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. లేదంటే.. బీజేపీ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ కావ‌టం ఖాయం.
Tags:    

Similar News