సోనాలి బింద్రెని చంపేసిన బీజేపీ ఎమ్మెల్యే

Update: 2018-09-08 08:53 GMT
అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన.. మహారాష్ట్ర బీజేపీలో కీలకనేత.   అవగాహన రాహిత్యంతో ఆయన చేసిన పనులు విమర్శలపాలవుతున్నాయి. ప్రస్తుతం క్యాన్సర్ కు అమెరికాలో చికిత్స చేయించుకుంటున్న బాలీవుడ్ ఫేమస్ నటి సోనాలిబింద్రేను బీజేపీ ఎమ్మెల్యే చంపేయడం కలకలం రేపింది. ఎవరో ఆకతాయి సొనాలి బింద్రే చనిపోయిందని చేసిన ట్వీట్ ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి శ్రద్ధాంజలి కూడా ఘటించాడు మహారాష్ట్రలోని ఘట్కోపర్ బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్.  ఈ ఎమ్మెల్యే చేసిన తెలివితక్కువ పనిపై విపరీతమైన విమర్శలొస్తున్నాయి.

సోనాలిని చంపేసిన బీజేపీ ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు.. ఇతడిపై వెంటనే సీఎం ఫడ్నవీస్, ముంబై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.   ఈ విషయం దుమారం రేగి ఆ ఎమ్మెల్యే దృష్టికి రావడంతో తప్పు చేశానని ఇప్పుడు మరో పోస్టు పెట్టాడు. ‘అది రూమర్ మాత్రమేనని.. నేను పొరపడ్డానని.. ఆమె ఆరోగ్యం కుదుటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ’ పోస్ట్ పెట్టి తప్పైందని అపాలజీ ఇచ్చుకున్నాడు.

బీజేపీలో ఈయన వివాదాస్పద ఎమ్మెల్యే.. గతంలో కృష్ణాష్టమి సందర్భంగా ఘట్కోపర్ సబర్బన్ ఏరియాలో ‘దహి హండి’ వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక ఆడపిల్లలను కిడ్నాప్ చేసి తీసుకొస్తానని.. ఈయన అన్నమాటలు వివాదాస్పదమయ్యాయి. ఇలా వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ ఎమ్మెల్యే వార్తల్లో నిలుస్తున్నాడు. 
Tags:    

Similar News