ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో 19 ఏళ్ల దళిత యువతిపై హత్యాచారం దేశాన్ని కుదిపేసింది. ఇప్పటికీ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
యూపీలో అత్యాచారంపై బీజేపీ సర్కార్ ను, సీఎం యోగిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘కూతుళ్లకు మంచి బుద్దులు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. వారికి మన సంస్కృతి, సంప్రదాయాలు నేర్పాలి. అప్పుడే అత్యాచారాలు తగ్గుతాయి’ అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించి దుమారం రేపాయి.
యూపీ ప్రభుత్వం మహిళలను రక్షించేందుకు కట్టుబడి ఉందని.. అలాంటి సమయంలో తల్లిదండ్రులు అమ్మాయిలకు సంస్కారం నేర్పాలని ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ నోరుజారారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది.
కాగా సురేంద్రసింగ్ వ్యాఖ్యలపై నెటిజన్లు, మహిళలు మండిపడుతున్నారు. అత్యాచారాలు చేసే ఉన్మాదులకు బీజేపీ ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. అబ్బాయిలకు మహిళలను గౌరవించాలని నేర్పించకుండా అమ్మాయిలను తప్పుపట్టడం ఏంటని నిలదీస్తున్నారు. సురేందర్ సింగ్ గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీ, మమతా బెనర్జీపై నోరుపారేసుకున్నారు.