కేసీఆర్ లో ర‌జాకార్ల ఆత్మ‌!

Update: 2018-09-17 10:47 GMT
తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై గోషామ‌హాల్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తిరంగా యాత్ర‌ను చేప‌ట్టిన నేప‌థ్యంలో ఆయ‌న‌పై కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. పోలీసుల అనుమ‌తి లేకుండా చేప‌ట్టిన‌ తిరంగా యాత్ర‌పై న‌మోదైన కేసుల‌కు సంబంధించి విచార‌ణ ఎదుర్కొంటున్న ఆయ‌న‌.. తాజాగా త‌న న్యాయ‌వాదితో క‌లిసి అబిడ్స్ పోలీస్ స్టేష‌న్ లో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

ఇద్ద‌రు న్యాయ‌వాదుల‌తో క‌లిసి విచార‌ణలో పాల్గొన్న ఆయ‌న పోలీసులు వేసిన ప్ర‌శ్న‌ల‌న్నింటికి సమాధానాలు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ‌లో ర‌జ‌కార్ల పాల‌న సాగుతుంద‌న్న ఆయ‌న‌.. 50 ఏళ్ల క్రితం తుడిచి పెట్టుకుపోయిన ర‌జాకార్ల ఆత్మ మ‌ళ్లీ ఇప్పుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో ప్ర‌వేశించింద‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.ఆగ‌స్టు 15 సంద‌ర్భంగా నిర్వ‌హించిన తిరంగా యాత్ర‌కు త‌న‌పై కేసులు పెట్టార‌న్నారు. ఇవ‌న్నీ చూస్తే తెలంగాణ పాకిస్థాన్ లో ఉందా?  భార‌త్ లో ఉందా? అని  ప్ర‌శ్నించారు.

తన‌ను ఎన్ని ఇబ్బందుల‌కు గురి చేసినా భ‌య‌ప‌డ‌న‌ని.. రాబోయే ఎన్నిక‌ల్లో కూడా తాను బీజేపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లుగా చెప్పారు. గోషామ‌హాల్ నుంచే తాను బ‌రిలోకి దిగుతాన‌ని చెప్పారు. మ‌జ్లిస్ ప్రోద్బ‌లంతోనే త‌న‌పై అక్ర‌మ కేసులు బ‌నాయిచార‌న్నారు. ఆగ‌స్టు 15న నిర్వ‌హించిన తిరంగా యాత్ర‌ను అనుమ‌తి తీసుకోకుండా నిర్వహించిన‌ట్లుగా పోలీసులు చెబుతున్నారు. తిరంగా యాత్ర కోసం అనుమ‌తి తీసుకోవాల‌ని పోలీసులు చెబుతున్నా.. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ యాత్ర‌ను నిర్వ‌హించార‌ని.. ఒక్క తెలంగాణ‌లో మాత్ర‌మే కేసులు న‌మోదు చేసిన‌ట్లుగా రాజాసింగ్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి.. మిగిలిన రాష్ట్రాల్లో తిరంగా యాత్ర‌ను నిర్వ‌హించిన వారిపై ఎలాంటి కేసులు న‌మోదు కాలేద‌ని గుర్తు చేస్తున్నారు. దేశంలో మ‌రే రాష్ట్రంలో కేసులు న‌మోదు చేయ‌లేద‌ని ఆయ‌న చెబుతున్నారు. దేశంలో మ‌రే రాష్ట్రంలో లేని రూల్స్ తెలంగాణ పోలీసులు అనుస‌రిస్తున్నారా ఏంది.?
Tags:    

Similar News