ముస్లింల‌తోనే స‌మ‌స్య‌లన్నీ అంటున్న ఎమ్మెల్యే

Update: 2018-01-02 08:53 GMT

మరో బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. కొద్దికాలం క్రితం వివాదాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నేత‌లు ఆ త‌ర్వాత స‌ద‌రు వివాదాల‌కు కాస్త దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ తాజాగా అలాంటి వ్యాఖ్యాలే చేశారు.  ఇండియా హిందువుల దేశమని - ముస్లింలతోనే సమస్యలు వస్తున్నాయని  వ్యాఖ్యానించారు. ముజఫర్‌ నగర్‌ లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో భాగంగా సైనీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం భార‌త దేశంలో కులాలతో సంబంధం లేకుండా అందరూ సమాన లబ్ధి పొందుతున్నారని తెలిపిన సైనీ...గతంలో పొడువైన గడ్డాలున్న వారికే వేగంగా లబ్ధి చేకూరేదని ఎద్దేవా చేశారు. అసలు హిందుస్థాన్ పేరులోనే ఇది హిందువుల దేశమని స్పష్టంగా ఉన్నదని సైనీ చెప్పారు.దేశ విభజన సమయంలో ముస్లింలు వెళ్తామంటే కొందరు వ్యక్తులు అడ్డుకున్నారని, అప్పుడు వాళ్లు అలా చేయకపోయి ఉంటే దేశమంతా మనదే అయ్యేదని సైనీ చెప్పారు. ఇప్పుడు ఆ ముస్లింలతోనే మనకు సమస్యలు ఎదురవుతున్నాయని సైనీ అన్నారు.

అంతకుముందే మరో బీజేపీ ఎంపీ నేపాల్ సింగ్ ఆర్మీ వారిపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఆర్మీలో ఉన్నవాళ్లు చనిపోతూనే ఉంటారని ఆయన అన్నారు. సీఆర్పీఎఫ్ క్యాంప్‌ పై జరిగిన ఉగ్రదాడిపై స్పందిస్తూ ఆయన ఇలా అనడం గమనార్హం. ప్రతిరోజూ చనిపోతూనే ఉంటారు. ప్రపంచ దేశాల్లో ఆర్మీవాళ్లు చనిపోని ఒక్క దేశం చెప్పండి అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. అసలు ఊళ్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగితేనే ఎవరో ఒకరు గాయపడతారని నేపాల్ సింగ్ చెప్పడం గమనార్హం.
Tags:    

Similar News