జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు తీర్చాలని దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.. ఈ దీక్షకు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల లక్ష్మీ పద్మావతి రాజమండ్రిలో జనసేన దీక్షలో పాల్గొనడం సంచలనమైంది. పవన్ ఒక్కరోజు దీక్షకు మద్దతుగా ఆమె జనసేన కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగడం బీజేపీని ఇరుకునపెట్టింది.
దీక్షకు దిగిన పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ తాను పవన్ కళ్యాన్ అభిమానిని అని చెప్పారు.. అందుకే ఆయనకు మద్దతుగా దీక్షకు కూర్చున్నానని చెప్పారు. ఈ విషయం తన భర్తకు తెలుసునని.. ఆయన పార్టీ ఆయనదేనని.. తన నిర్ణయం తనదేనని చెప్పారు. 2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ గెలువాలని తాను ప్రచారం చేశానని చెప్పుకొచ్చారు. పవన్ విధానాలు నచ్చి తాను జనసేనకు మద్దతు తెలిపానన్నారు. తాను పవన్ నుంచి ఎలాంటి పదవులు, గుర్తింపు ఆశించడం లేదన్నారు.
ఇక పవన్ దీక్షకు సీపీఎం, సీపీఐ పార్టీలు మద్దతు తెలిపాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు తమ సంఘీభావాన్ని తెలిపారు. టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం లో ఎలాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదని.. 2019లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు.