ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మాట్లాడిన జగన్.. హోదా అంశాన్ని ప్రస్తావించారు. ప్రతి సందర్భంలోనూ ఆయన ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని టచ్ చేస్తున్నారు. మొదట్నించి తాను హోదా మీద ఒకే స్టాండ్ లో ఉన్నానని.. హోదా సాధన విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారని చెప్పాలి.
ఇలాంటివేళ.. జగన్ మాటకు కౌంటర్ ఇస్తూ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసిందని చెప్పాలి. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వరని.. ఇప్పుడు కూడా ఇవ్వమంటూ చేసిన ఆయన వ్యాఖ్య ఆసక్తికరంగా మారాయి. నవరత్నాలు సక్రమంగా అమలు చేయాలని కోరుకుంటున్నామని.. వాటిని అమలు చేయాలంటే రూ.2.5లక్షల కోట్లు అవసరమన్నారు.
ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లాలన్న సూచన చేసిన మాధవ్.. హోదా విషయంపై కుండబద్ధలు కొట్టినట్లుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల్ని వారే అమలు చేయాలని.. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వరన్నారు. ఇప్పుడు కూడా ఇవ్వమని చెప్పిన ఆయన.. ఆర్థికంగా సపోర్ట్ చేస్తామని చెప్పారు.
చంద్రబాబు చేసిన అబద్ధపు ప్రచారాన్ని తమ కార్యకర్తలు చాలామంది నమ్మి బీజేపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకేటనని ఆ పార్టీకి ఓటు వేసినట్లుగా పేర్కొన్నారు. బీజేపీ బలోపేతానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తామన్నారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలవటానికి జనసేన.. బీజేపీనే కారణంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా వ్యవస్థల్ని చంద్రబాబు స్వప్రయోజనాల కోసం వినియోగించుకున్నట్లు ఆరోపించారు. దుబారా ఖర్చులు పెట్టారని.. వాటిపై విచారణ చేపట్టాలన్నారు. హోదా పై బీజేపీ ఎమ్మెల్సీ ఇచ్చిన కౌంటర్ కు.. ఏపీకి కాబోయే సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.