రాజకీయాల్లో ఉండే నేతలంతా మాట్లాడతారు. ఆ విషయంలో ఎవరికి ఎలాంటి ఢోకా ఉండదు. సమయానికి తగ్గట్లుగా భావోద్వేగాన్ని రంగరించి.. తమకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చుకునే నేర్పు కొందరు నేతల్లో ఉంటే.. ఏ సమయంలో మాట్లాడినా.. ప్రత్యర్థులు పంచ్ లు వేసేలా మాట్లాడే వారు మరికొందరు ఉంటారు. ఇక.. దూకుడుగా.. అడ్డ బ్యాటింగ్ తో ఆడేసుకునే తీరు ఇంకొందరిలో కనిపిస్తుంది. అలాంటి కోవలోకే వస్తారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
తాను ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ అధినేతకు కొండంత అండగా నిలుస్తూ.. ప్రత్యర్థులపై విరుచుకుపడే తీరు తలసానిలో ఎక్కువే. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న వేళలో..టీడీపీలో ఉన్న తలసాని తన పొలిటికల్ బాస్ చంద్రబాబుకు దన్నుగా నిలుస్తూ.. ఇప్పటికి బాస్ అయిన కేసీఆర్ ను మాటలతో ఎంతలా ఆడేసుకున్నారో మర్చిపోలేం.
ఇప్పుడు కేసీఆర్ కు వీర విదేయుడిగా వ్యవహరించే తలసాని.. తన తాజా పొలిటికల్ బాస్ పై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్న వైనంపై తీవ్రంగా గుస్సా అవుతున్నారు. టీఆర్ఎస్ నేతలకు సరిజోడిగా నిలిచే బీజేపీ నేతలు ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి అధికారాన్ని చేపట్టిన వేళ.. పార్టీకి కలగా మారిన దక్షిణాదిన పాగా వేసే ఆపరేషన్ ను సీరియస్ గా తీసుకున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో కాషాయ జెండాను ఎగురవేయటమే లక్ష్యమన్నట్లుగా పెట్టుకున్న బీజేపీ.. అందుకు తగ్గట్లే పావులు కదుపుతోంది. తెలంగాణలో బలమైన క్యాడర్ ఉన్న టీడీపీకి చెందిన నేతలు పలువురిని తమ పార్టీలో చేర్చుకుంటూ తెలుగుదేశం పార్టీ మొత్తంగా ఖాళీ చేసే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు టీఆర్ఎస్ లో చేరిపోగా.. ఏదో ఒక రోజు తమకూ అవకాశం దక్కుతుందన్న ఆశ ఉన్న తమ్ముళ్లు పార్టీలో ఉండిపోయారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఎలాంటి అవకాశం లేదన్న విషయంపై క్లారిటీ తెచ్చుకున్న తమ్ముళ్లు.. ఇప్పుడు మూకుమ్మడిగా బీజేపీలో చేరే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు. బీజేపీ జోరుకు బ్రేకులు వేసేందుకు తలసాని రంగంలోకి దిగి.. వారిపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మాటలతో తమను దెబ్బ తీయాలని ట్రై చేసే వారికి భారీ షాకులిచ్చే అలవాటున్న కమలనాథులు.. తాజాగా తలసాని చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. కౌంటర్ ఇచ్చేశారు.
బీజేపీని సింఫుల్ గా తీసిపారేసిన తలసానికి దిమ్మ తిరిగేలా షాకిస్తూ వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు. తలసాని కొడుకును తమ పార్టీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఓడించిన వైనాన్ని మర్చిపోకూడదంటూ.. ఎక్కడ టచ్ చేస్తే.. తలసాని కామ్ అవుతారో అక్కడే టచ్ చేశారు. మరి.. కమలనాథులు ఇచ్చిన కొడుకు కౌంటర్ కు.. తలసాని ఇప్పట్లో సమాధానం చెప్పే అవకాశం లేదంటున్నారు. అందుకే అనేది.. అన్నిసార్లు అడ్డబ్యాటింగ్ వర్క్ వుట్ కాదని చెప్పేది.