సచిన్ టెండూల్కర్ తో కలిసి స్కూల్ క్రికెట్లో సంచలనాల మోత మోగించి.. సచిన్ వచ్చిన కొన్నాళ్లకే టీమ్ఇండియాలోకి వచ్చి కెరీర్ ఆరంభంలో సంచలన ఇన్నింగ్స్ ఎన్నో ఆడాడు వినోద్ కాంబ్లి. కానీ సచిన్ లాగా కెరీర్ ను జాగ్రత్తగా తీర్చిదిద్దుకోవడంలో అతను విఫలమయ్యాడు. ఎంత వేగంగా లైమ్ లైట్లోకి వచ్చాడో.. అంతే వేగంగా ఫేడవుట్ అయిపోయాడు. సరైన గైడెన్స్ లేకపోవడం.. స్వీయ క్రమశిక్షణ కొరవడటమే అతడి కెరీర్ అలా తయారవ్వడానికి కారణాలన్నది అందరికీ తెలుసు. కాంబ్లి కెరీర్ ముగిసిపోయి కూడా దశాబ్దంన్నర దాటిపోయింది. ఇప్పుడు అతడి గురించి బాధపడేవాళ్లు కూడా ఎవరూ లేరు.
ఐతే ఇలాంటి టైంలో బీజేపీ ఎంపీ ఉన్నట్లుండి కాంబ్లి పేరుతో రాజకీయాలు చేయడానికి చూస్తున్నాడు. దళితుడు కావడం వల్లే కాంబ్లి కెరీర్ నాశనం అయిపోయిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాంబ్లిని అందరూ మరిచిపోయిన సమయంలో ఇప్పుడు అతడి పేరును వాడుకుని దళితుల్ని ఆకర్షించాలని చూడటం విడ్డూరమే. దీనిపై స్వయంగా కాంబ్లినే ఎంపీకి కౌంటర్ ఇచ్చాడు. ఎంపీ చేసిన వ్యాఖ్యలు సరి కావని అతనన్నాడు. తాను అలా భావించడం లేదని చెప్పాడు. తన కెరీర్ గురించి ఇతరులెవరూ పట్టించుకోవాల్సిన పని లేదని కుండబద్దలు కొట్టాడు. ఎవరి పని వాళ్లు చూసుకోవాలని స్పష్టం చేశాడు. ఉదిత్ రాజ్ కావాలనే ఇప్పుడు దళిత కార్డు వాడి.. ఆ వర్గం ప్రజల్ని ఆకట్టుకోవాలని చూస్తున్నాడని.. ఆయనకు మతి భ్రమంచిందని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/