ఆ కుటుంబాల వారే సుప్రీం జ‌డ్జీల‌వుతార‌ట‌!

Update: 2018-09-04 13:53 GMT
రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి పాలైతే....అందుకు గ‌ల కార‌ణాల్లో ఆ పార్టీ నేత‌ల వ్యాఖ్య‌ల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక త‌ప్ప‌దేమోన‌న్న భావ‌న స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల వ‌ల్ల బీజేపీకి జ‌రిగే డ్యామేజీ క‌న్నా.....కొంత‌కాలంగా బీజేపీ నేత‌లు చేస్తోన్న వ్యాఖ్య‌ల వ‌ల్ల జ‌రుగుతోన్న డ్యామేజీ ఎక్కువంటే అతిశ‌యోక్తి కాదు. సాక్ష్యాత్తూ ప్ర‌ధాని మోదీ రంగంలోకి దిగి....త‌మ ఎమ్మెల్యేలు - సీఎంల‌కు హిత‌బోధ చేసినా...వారి తీరులో కించిత్తు మార్పు కూడా ఉండ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా, మ‌రో ఎంపీ ....ఏకంగా సుప్రీం కోర్టు జడ్డిల‌పైనే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. సుప్రీంకోర్టులో జనరల్ కేటగిరి జడ్జీలున్నందువల్లే ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టంలో అరెస్టు నిబంధనను సడలించారని ఉజ్జయిని బీజేపీ ఎంపీ చింతామణి మాలవీయ షాకింగ్ కామెంట్స్ చేశారు.

సుప్రీంకోర్టులో ఒక్క ఎస్టీ జడ్జీ కూడా లేర‌ని - కొలీజియం విధానంలో త‌మ‌కు తామే జ‌డ్జీలు నియామకాలు చేపట్ట‌డం వ‌ల్లే ఇలా జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఆ కార‌ణంతోనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల చ‌ట్టం స‌వ‌ర‌ణ‌ విషయంలో పక్షపాత నిర్ణయం తీసుకున్నార‌ని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాలవీయ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, ఆ వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ కోరిన విలేక‌రికి మాలవియా మైండ్ బ్లాక‌య్యే స‌మాధాన‌మిచ్చారు. అందరికీ తెలిసిన యదార్థమే తాను మాట్లాడాన‌ని, తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేద‌ని స‌మ‌ర్థించుకున్నారు. ఎస్సీఎస్టీ చట్టంలో అరెస్టు నిబంధనను సడలించడం తప్పేన‌ని మ‌రోసారి ఆ విలేక‌రికి నొక్కి వ‌క్కాణించారు. దేశంలో ప్ర‌త్యేకంగా 500 కుటుంబాలున్నాయ‌ని, ఆ కుటుంబాల‌కు చెందిన వారు మాత్ర‌మే జనరల్ కేటగిరి కింద సుప్రీంకోర్టులో జడ్జీలుగా ఎంపికవుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో రిజర్వేషన్ లేనందువల్లే ఈ విధంగా జరుగుతోంద‌ని వివరించారు.
Tags:    

Similar News