రాజ్యసభ సభ్యుడు - భారతీయ జనతా పార్టీ నేత సీఎం రమేష్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సీఎం రమేష్ సోదరుడైన సీఎం ప్రకాష్ మృతిచెందారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న సీఎం ప్రకాష్ గత కొంతకాలంగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 8 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. సీఎం ప్రకాష్ మృతితో రాజ్యసభ సభ్యుడి ఇంట్లో విషాదం నెలకొంది.
కొంతకాలంగా వైద్యుల పర్యవేక్షణలో సీఎం ప్రకాష్ చికిత్స పొందుతున్నారని, సోమవారం సాయంత్రం ఆయన మృతి చెందినట్లు వైద్యులు సమాచారం ఇచ్చారని కుటుంబసభ్యులు తెలిపారు. సీఎం రమేష్ కుటుంబ స్వగ్రామమైన కడప జిల్లా పొట్లదుర్తిలో మంగళవారం ప్రకాష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా - సీఎం రమేష్ ఇంట్లో ఈ ఒక్క సంవత్సరంలోనే జరిగిన రెండో విషాదం ప్రకాష్ మరణం - సీఎం రమేష్ మేనల్లుడు ధర్మారామ్ ఇంటర్ పరీక్షల్లో ఫెయిలవడంతో హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న తమ అపార్ట్ మెంట్ ఏడో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్వల్ప వ్యవధిలో జరిగిన రెండు ఘటనలతో సీఎం రమేష్ కుటుంబం ఆవేదనలో కూరుకుపోయింది.