ఏపీ పై కేంద్రం డేగకన్ను.. బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. సంచలన కామెంట్లు
ఏపీ పై కేంద్ర ప్రభుత్వం డేగకన్ను సారించిందని.. బీజేపీ ఎంపీ, మాజీ టీడీపీ నాయకుడు సీఎం రమేష్ సంచలన కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఏపీ పోలీసులు అనుసరిస్తున్న విధానాలను కేంద్రం మరింత నిశితంగా చూస్తోందన్నారు. ``ఏపీ పోలీస్ వ్యవస్థ పై కేంద్రం టెలీస్కోపు నిఘా తో చూస్తోంది. త్వరలోనే ప్రక్షాళన చేస్తుంది`` అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు... త్వరలోనే ఏపీ లో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కేంద్రం చర్యలు తీసుకోబోతోందని సీఎం రమేష్ పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వ్యవహరించడం లేదని ఆయన ప్రశ్నించారు. పార్టీలు అధికారం లోకి వస్తాయి, పోతాయి.. వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాలని సూచించారు. పోలీస్ ఉన్నతాధికారుల తీరు సరిగా లేదన్నారు. అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారుల విషయంలో కేంద్రం ఏ విధంగా వ్యవహరించిందో చూడాలని.. సీఎం రమేష్ రాష్ట్ర పోలీసులకు హితవు పలికారు.
ఇప్పుడున్న పరిస్థితి ఇలానే కొనసాగితే.. ఏపీలోనూ సీనియర్ అధికారులను కేంద్రం వెనక్కి పిలవడం ఖాయమని చెప్పారు. రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తే కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిందన్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు.. అవినీతి కార్యక్రమాల పై ఈ నెల 28వ తేదీన బీజేపీ సభ నిర్వహిస్తోందని రమేష్ వివరించారు. తొలిసారి సీఎం అయ్యారు కాబట్టి.. నెమ్మదిగా అర్ధం చేసుకుంటారని బీజేపీ ఇన్నాళ్లూ వేచి చూసిందని, కానీ, ఏపీ ప్రభుత్వం విధ్వంసకర విధానాలను అవలంభిస్తోందని.. కాబట్టి అడ్డు కట్ట వేస్తుందని.. ఆయన చెప్పుకొచ్చారు.
రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బ తిన్నాయని పట్టించుకోవడం లేదన్నారు. ఇసుక అందుబాటు లో లేదని.. సిమెంట్ ధరలు ఆకాశాన్ని అంటుతోందని రమేష్ విమర్శించారు. సినిమా రేట్ల పై ఈ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పై ఎందుకు లేదంటూ ప్రశ్నించారు. సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు పై థియేటర్ యజమానులు కోర్టుకెళ్తే.. హాళ్లను సీజ్ చేయిస్తారా.. అంటూ మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు ఎంత ఉన్నాయి? అక్కడి విధానం ఏంటో ఓసారి చూడాలని సూచించారు.
ఎవరినో దృష్టిలో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తారా.. అని సీఎం రమేష్ నిప్పులు చెరిగారు. ప్రజలకు ప్రభుత్వమే విక్రయిస్తున్న మద్యం ద్వారా వచ్చే ఆదాయం పై తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని రమేష్ డిమాండ్ చేశారు. దశలవారీ మద్య నిషేధం కాదు.. దశల వారీ మద్యం వినియోగాన్ని జగన్ ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని మండిపడ్డారు.
ఏపీలో జరిగే ప్రతి కార్యక్రమం కేంద్ర నిధులతోనే చేస్తున్నారన్నారు. గ్రామ సచివాలయాల నిర్మాణం కూడా కేంద్ర నిధులతోనే చేపట్టారని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల నిర్మాణం బిల్లులు కూడా ఇవ్వలేదని తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు.. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదని దీనికి సీఎం అక్కడి ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. మొతత్తానికి బీజేపీ సీనియర్ నేతలు.. ఇప్పుడు గళం వినిపిస్తుండడం పై చర్చ సాగుతోంది. ఇటీవల మరో ఎంపీ సుజనా చౌదరి కూడా ఇలానే పోలీసుల పై నిప్పులు చెరిగారు. నేరుగా ఫిర్యాదు కాపీలను తనకు పంపించాలని.. తాను చూసుకుంటానని ఆయన చెప్పడం గమనార్హం. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.