తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీ ఇప్పటివరకు 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిందని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో తనకు అన్ని విధాలా సహకరిస్తున్న వైసీపీని కూడా బీజేపీ వదిలిపెట్టడం లేదని కేసీఆర్ మండిపడ్డారు. వైసీపీకి చెందిన 70 మంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వాన్ని తాము అస్ధిరపరిచేందుకు ప్రయత్నించామని కేసీఆర్ ఆరోపించడం ద్వారా చీప్ పబ్లిసిటీ పొందాలని ప్రయత్నిస్తున్నారని జీవీల్ ధ్వజమెత్తారు.
కట్టుకథలు, కాల్పనిక విషయాలు సృష్టించడం ద్వారా రాజకీయ సంచలనం కోసం కేసీఆర్ ఆరాటుపడుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పూర్తి అవాస్తవాలు, కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
కేసీఆర్‌ను ఏమైనా వైసీపీ అధికార ప్రతినిధిగా ఏమైనా నియమించారా అని జీవీఎల్ ఎద్దేవా చేశారు. వైసీపీకి లేని భయాలు కేసీఆర్‌కు ఎందుకు అని నిలదీశారు. కేసీఆర్ వైసీపీని నడిపిస్తున్నారా లేదా ఆ పార్టీకి ప్రతినిధిగా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు,
తన పార్టీకి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అని పేరు పెట్టుకున్న కేసీఆర్ మీడియా కవరేజ్ కోసం ప్రయత్నిస్తున్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడాలనుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు, అవాస్తవాలు ద్వారా ప్రచారం పొందాలని చూస్తే కేసీఆర్ విశ్వసనీయత దెబ్బతింటుందని చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ తప్పుడు వ్యాఖ్యలు, కథనాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.
వైసీపీని అస్థిరపరుస్తున్నామనేది కేసీఆర్ కల్పించుకున్న కొత్త స్క్రిప్ట్ అని.. కథ, నిర్మాత అంతా కేసీఆరే అని జీవీఎల్ ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నించామనే ఆరోపణ అవాస్తవమని.. ఆ విషయాన్ని తమ నాయకత్వం ఇప్పటికే గట్టిగా చెప్పిందని జీవీఎల్ గుర్తు చేశారు. 2024లో భారతీయ జనతాపార్టీ, జనసేనతో కలిసి ప్రత్యామ్నాయంగా అవతరిస్తామన్నారు.
ఎన్నికల ముందు తమ పార్టీలోకి విస్తృతంగా చేరికలు ఉంటాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు చేరికలను తప్పనిసరిగా ప్రోత్సహిస్తామని జీవీఎల్ తెలతిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.