అంబటి తిరుపతి రాయుడు అనూమ్యంగా రిటైర్మెంట్ ను అనౌన్స్ చేయడంపై తీవ్రంగా స్పందించాడు భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. రాజకీయాల్లోకి వెళ్లినా క్రికెట్ పై వ్యాఖ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు గంభీర్. ఎంపీ హోదాలో ఉన్నా క్రికెట్ పై స్పందిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాయుడు రిటైర్మెంట్ పై కూడా గంభీర్ తన వ్యాఖ్యానం చేశారు.
అందులో భాగంగా టీమిండియా సెలెక్టర్లపై గంభీర్ తీవ్రంగా ధ్వజమెత్తాడు. వారి తీరును తప్పు పట్టాడు. ప్రపంచకప్ కు టీమ్ ను ఎంపిక చేయడంలో రాయుడును పరిగణనలోకి తీసుకోకపోవడంపై గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు.
ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన ఆటగాళ్లు వరసగా ఒకరి తర్వాత మరొకరు గాయపడి తిరుగుముఖం పట్టినా రాయుడుకు మాత్రం అవకాశం ఇవ్వలేదు సెలెక్టర్లు. రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్ లను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశారు కానీ, రాయుడుకు అవకాశం ఇవ్వలేదు.
ఈ అంశాన్ని గంభీర్ ప్రస్తావించాడు. సెలెక్టర్ల తీరును ఈ అంశంపై తీవ్రంగా తప్పు పట్టాడు ఈ మాజీ క్రికెటర్. మామూలుగా గంభీర్ ఇలా స్పందించింది ఉంటే అది కేవలం క్రీడా విశ్లేషణ మాత్రమే అయ్యేది. అయితే ఆయన ఒక బీజేపీ ఎంపీ గా కూడా ఉన్నారు కాబట్టి.. ఇలా స్పందించడం మరింత చర్చనీయాంశం అవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.