భారతీయ జనతా పార్టీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఢిల్లీలో ఆయన నివాసంలోనే ఉరి వేసుకొని మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. గోమతి అపార్ట్ మెంట్ లోని తన ఫ్లాట్ లో రామ్ స్వరూప్ శర్మ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన ఫ్లాట్ లో రామ్ స్వరూప్ శర్మ ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు గోమతి అపార్ట్‌మెంట్ చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం ఆయన ఒంటరిగా ఉంటున్నారు. ఆయన భార్య .. చార్‌థామ్ యాత్రలో ఉన్నట్లు తెలుస్తోంది. శర్మకు చెందిన పర్సనల్ సెక్యూర్టీ ఆఫీసర్ ప్రస్తుతం మండీలో ఉన్నారు.
62 ఏళ్ల రామ్ స్వరూప్ శర్మ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రామ్ స్వరూప్ శర్మ మృతితో బీజేపీ పార్లమెంటరీ సమావేశం వాయిదా పడింది. ఆయన 1958లో హిమాచల్ ప్రదేశ్ లోని మండిలో జన్మించారు. రామ్ స్వరూప్ శర్మకు భార్యా, ముగ్గురు కుమారులు ఉన్నారు. 2014లో లోక్ సభ ఎన్నికల్లో తొలిసారి ఆయన ఎంపీగా గెలించారు. అనంతరం 2019 ఎన్నికల్లోనూ రెండోసారి విజయం సాధించారు. రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన రామ్ స్వరూప్ కు వివాదరహితుడిగా పేరుంది. కాగా, గత నెలలో దాద్రా నగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని ఓ హోటల్‌లో ఆయన మరణించారు. ఈ ఘటన గురించి అందరూ పూర్తిగా మరచిపోకమునుపే మరో ఎంపీ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.