మహారాష్ట్ర రాజకీయం జోరందుకుంది. రాజకీయ ప్రత్యర్థులకు ఏ మాత్రం మింగుడుపడని రీతిలో పావులు కదిపిన మోడీషాలు.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా వ్యవహరించటం తెలిసిందే. నోటి వరకూ వచ్చిన ముద్దను నోట్లోకి పోనివ్వకుండా అడ్డుకున్న కమలనాథుల తీరును ఎండగట్టేందుకు తాజాగా శివసేన సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అయితే.. ఈ చర్యతో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు తక్కువని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. చేతికొచ్చిన పగ్గాల్ని చేజార్చుకోకూడదన్న పట్టుదలతో బీజేపీ వర్గాలు ఉన్నాయి.
శరద్ పవార్ కు షాకిస్తూ ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ ను తమవైపుకు లాగేసుకున్న బీజేపీ నేతలు.. ఎన్సీపీ పెద్దాయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నాల్ని ముమ్మురం చేశారు. ఇందులో భాగంగా బీజేపీ ఎంపీ సంజయ్ కాకడేను రంగంలోకి దించారు. ఇప్పటికే మహా ఎపిసోడ్ ను ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు పలువురు కృష్ణుళ్లను రంగంలోకి దింపిన కమలనాథులు.. ఇప్పుడు సంజయ్ ను సీన్లోకి తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు.
శరద్ పవార్ తో చక్కటి సంబంధాలు ఉన్నాయని చెప్పే ఆయన తాజాగా శరద్ పవార్ ఇంటికి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ ఇంటికి బీజేపీ ఎంపీ ఒకరు వెళ్లటం.. ఆయనతో చర్చలు జరపటంపై పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం లేదన్న వాదనను వినిపిస్తోంది.
సేనకు అంచనాకు తగ్గట్లే శరద్ పవార్ తో బీజేపీ ఎంపీ భేటీ కావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మూడు..నాలుగు రోజుల క్రితం ప్రధాని మోడీతో శరద్ పవార్ భేటీ కావటం తెలిసిందే. అప్పట్లో మహారాష్ట్ర రైతుల సమస్యల పరిష్కారం కోసం తాను కలిసినట్లు చెప్పగా.. తాజాగా పవార్ ను భేటీ అయిన బీజేపీ ఎంపీ మాట్లాడుతూ.. ఆయన క్షేమ సమాచారం తెలుసుకునేందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడు శరద్ పవార్ క్షేమ సమాచారం కోసం రావటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.