ఖద్దరు - ఖాకీ మధ్య అవినాభావ సంబంధం ఈనాటిది కాడు. అధికారంలో ఉండే పార్టీలు సలాం కొట్టే పోలీసులు చాలా మందే ఉన్నారు. అలాగని పోలీసులను అందరినీ అదే గాటన కట్టేయలేమనుకోండి. అయితే ఖద్దరుతో కలిసిమెలసి తిరిగే అలవాటున్న ఓ పోలీసు పెద్ద చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. విధి నిర్వహణలో ఉంటూ ఖాకీ యూనీఫాం వేసుకుని మరీ సదరు ఐపీఎస్ అధికారి ఏకంగా సీఎంగా ఉన్న రాజకీయ నేత కాళ్లకు నమస్కారం పెట్టారు. రాజకీయ సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అక్కడి అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ అధినేత్రి - బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు ఆమె కాళ్లకు దండం పెట్టిన పోలీసు పెద్దాయన ఇప్పుడు చిక్కుల్లో పడిపోయారు. వీడియో సాక్ష్యంగా రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిపోయిన సదరు ఖాకీకి ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి నోటీసులు రాగా... ఖాకీతో కాళ్లకు వందనం చేయించుకున్న మమతా బెనర్జీపై బీజేపీ సహా పలు పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి.
ఓ వారం క్రితం చోటుచేసుకున్నట్లుగా చెబుతున్న ఈ ఘటనకు సంబందించిన ఓ వీడియో ఇప్పుడు పెను సంచలనంగా మారిపోయింది. నిడివి బాగా తక్కువగానే ఉన్న ఈ వీడియోలో సదరు పోలీసు పెద్దాయన.. దర్జాగా కూర్చుని కేక్ తినిపించిన దీదీ కాళ్లను తన చేతులతో ముట్టుకుని ఆ చేతిని తన నుదుటికి రుద్దుకుని దండం పెట్టేశారు. సదరు ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ నెల 21న సీఎం హోదాలో దీదీ ఈస్ట్ మిడ్నాపూర్ పరిధిలోని దిఘా పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంగా బర్త్ డే జరుపుకుంటున్న ఐపీఎస్ అధికారి వినీత్ గోయల్ కు దీదీనే స్వయంగా కేక్ తెప్పించి... ఆయనతో కట్ చేయించారు. అంతటితో ఆగని దీదీ సదరు కేక్ ను గోయల్ నోటికి అందించారు. పనిలో పనిగా గోయల్ పక్కనే ఉన్న మరో సీనియర్ ఐపీఎస్ అధికారి - బెంగాల్ వెస్ట్ రేంజి ఐజీగా పనిచేస్తున్న రాజీవ్ మిశ్రాకు కూడా దీదీ కేక్ తినిపించారు.
దీదీ కేక్ తినిపించేందుకు చేయి చాచగానే... ముందుకు వచ్చిన మిశ్రా... దీదీ తన నోట్లో కేక్ పెట్టగానే... అక్కడికక్కడే వంగి దీదీ కాళ్లకు నమస్కారం పెట్టారు. దీదీ కాళ్లను తన చేతితో ముట్టుకుని ఆ చేతిని తన నుదుటి ముందు పెట్టుకుని వందనం పెట్టారు. మొత్తంగా దీదీకి పాదాభివందనం చేశారన్న మాట. ఈ సందర్భంగా తృణమూల్ నేతలు కొందరు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో చిత్రీకరించారు. అలా ఆ వీడియోలు ఆ నోటా - ఈ నోటా పడి ఎట్టకేలకు బయటకు వచ్చేశాయి. ఓ రాజకీయ నేతకు ఐపీఎస్ అధికారి హోదాలో - అది కూడా ఖాకీ డ్రెస్ లో ఉండి పాదాభివందనం చేసిన మిశ్రాపై పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఖాకీలను దీదీ ఎలా మచ్చిక చేసుకున్నారో ఈ ఒక్క ఘటనే నిదర్శనమని వైరి వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మొత్తంగా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయిపోగా... అటు సీఎంకు పాదాభివందనం చేసిన మిశ్రాతో పాటు... ఆయన చేత పాదాభివందనం చేయించుకున్న దీదీపైనా విమర్శలు విరుచుకుపడుతున్నాయి.