కేంద్రాన్నే తప్పుపట్టిన బీజేపీ ఎంపీ?

Update: 2022-07-01 13:30 GMT
ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ప్రకారం ర్యాంకింగులిచ్చిన కేంద్రప్రభుత్వాన్ని బీజేపీ ఎంపి జీవిఎల్ నరసింహారావు తప్పుపట్టారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వాతావరణం కల్పించటం, బిజినెస్ అవకాశాలను పెంచుకోవటం తదితరాలపై దేశంలోని అన్నీ రాష్ట్రాలకు కేంద్రం ప్రతి ఏడాది ర్యాంకింగులిస్తుంది.

తాజాగా కేంద్రం ప్రకటించిన ర్యాంకింగుల్లో ఏపీకి మొదటిస్ధానం వచ్చింది. దీన్ని జీవీఎల్ తప్పుపడుతున్నారు. కేంద్రం ప్రకటించినట్లు ఏపీకి మొదటిర్యాంకు వచ్చేంత సీన్ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆయన అభిప్రాయం ఓకేనే అనుకుందాం. మరి ర్యాంకులిచ్చింది కేంద్రంలోని తమ ప్రభుత్వమే కదా. ఏపీకి ఇచ్చిన ర్యాంకు తప్పయితే అందుకు బాధ్యత వహించాల్సింది నరేంద్రమోడి ప్రభుత్వం మాత్రమే. మొదటిర్యాంకు అందుకునేంత సీన్ లేదని ఏపీని ఎగతాళిచేసేబదులు అసలు ర్యాంకు ఎలా ఇచ్చారని అడగాల్సింది కేంద్రాన్నే కదా. ర్యాంకులిచ్చే విధానాన్ని పునఃసమీక్షించాలని కేంద్రాన్ని జీవీఎల్ కోరటం గమనార్హం.

అలాగే కొన్ని రాష్ట్రాలు అప్పులుచేయటంలో కేంద్రం కళ్ళుగప్పుతున్నాయనే విచిత్రమైన విమర్శచేశారు. ఏ రాష్ట్రమైన ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి లోబడే అప్పులు చేయాలని జీవీఎల్ కొత్తగా చెబుతున్నారు.

జీవీఎల్ చెప్పిన విషయం ప్రతిరాష్ట్రానికి తెలుసు. అయితే కేంద్రం కళ్ళుగప్పి కొన్ని రాష్ట్రాలు ఎలా అప్పులు తెచ్చుకుంటున్నాయన్నదే పాయింట్. రాష్ట్రాలు కేంద్రం కళ్ళు కప్పేస్తున్నాయంటే కేంద్రం అంత కళ్ళు మూసుకుని కూర్చున్నదా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఆర్టీసీ ఛార్జీలు రెండునెలల్లో రెండుసార్లు పెంచిన రాష్ట్రప్రభుత్వాన్ని తప్పుపట్టారు. కేంద్రం డీజల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తుంటే రాష్ట్రాలు ఆర్టీసీ ఛార్జీలు పెంచటం ఏమిటన్నారు. 60 రూపాయలున్న పెట్రోలు రేటును మోడి సర్కార్ 120కి పెంచి ఓ ఐదు రూపాయలు తగ్గించటాన్నే భారీగా తగ్గించేసినంత బిల్డప్ ఇస్తున్నారు జీవీఎల్. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుండి రు. 800 కోట్లు లాగేయటం దారణమన్నారు. అప్పుపుట్టని రోజున ప్రభుత్వం ఎవరో ఒకరి అకౌంట్లలోకి దూరిపోయి డబ్బులు లాగేస్తోందంటు మండిపోయారు.
Tags:    

Similar News