ప్రధాని మోడీ మాటలకు.. చేతలకు మధ్యనున్న తేడా ఏమిటన్న విషయంలో తాజా ఉదంతం చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు. పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నప్పుడు.. పవర్ తన చేతిలోనే ఉంటుందన్న నమ్మకం కలిగినప్పుడు మోడీ చక్కటి వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారిపోతారు. నీతులు మాట్లాడతారు. విలువల గురించి చెబుతారు. అసలు మనం ఎలా ఉండాలంటే.. అన్న మాటను వాడకున్నా.. ఆయన మాటలన్ని దాని చుట్టూనే తిరుగుతుంటాయి.
మొన్నటికి మొన్న లోక్ సభలో ప్రతిపక్షాలు కీలకమని.. వారికుండే సంఖ్య ఎంతన్నది కాదన్నది ముఖ్యం కాదని.. వారి ఉనికి చాలా అవసరమంటూ గొప్పగా చెప్పారు. విపక్షాలను ఉద్దేశించి మోడీ మాటల్ని చూసిన వారిలో ఎక్కువమంది.. ఆహా.. ఇలాంటి ప్రధాని కదా దేశానికి అవసరం. ఇంత భారీ విజయం సాధించిన తర్వాత కూడా విపక్షాల విషయంలో ఎంత పెద్ద మనసుతో ఆలోచిస్తున్నారు? ఏమైనా మోడీ గ్రేట్ అంటూ తన్మయత్వంలో ఊగిపోతూ.. నమో భజన చేయటం కనిపిస్తుంది.
మరి.. వాస్తవం ఎలా ఉంటుందన్నది చూడాలంటే గడిచిన రెండు రోజులుగా జరిగిన లోక్ సభ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. హుందాగా సాగాల్సిన ప్రమాణస్వీకారోత్సవంలో కొత్త దరిద్రాన్ని మోడీ బ్యాచ్ ఈసారి షురూ చేసిందని చెప్పాలి. బీజేపీ తరచూ ప్రస్తావించే అంశాల మీద ఆగ్రహం ఉన్నవారు.. వారి సిద్ధాంతాన్ని.. భావజాలాన్ని వ్యతిరేకించే వారు ప్రమాణస్వీకారం చేసేటప్పుడు..వారిని హర్ట్ చేసేలా.. గేలి చేసేలా పెద్ద ఎత్తున నినాదాలు చేసే కొత్త సంప్రదాయానికి పరిచయం చేశారు మోడీ పరివారం.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలకు జైశ్రీరాం అనే నినాదం నచ్చదు. ఆ ఎంపీలు ప్రమాణస్వీకారం చేసే వేళలో ఆ నినాదాన్ని పెద్ద ఎత్తున సభలో చేయటం ఏ మేరకు కరెక్ట్? జై దుర్గ.. వందేమాతరం.. జైహింద్.. భారత్ మాతాకు జై.. లాంటివి నేతలు ఎవరికి వారికి సహజసిద్ధంగా రావాల్సిన నినాదాలు కానీ.. తమ రాజకీయ ప్రత్యర్థులకు చిరాకు తెప్పించటానికి ఇలాంటి వాడకూడదు. దురదృష్టవశాత్తు.. మర్యాదరామన్న మాస్టర్ గా ఉన్న మోడీ సభా నాయకుడిగా ఉన్న సభలో ఇలాంటి ఎందుకు జరుగుతున్నట్లు? అలాంటి వాటిని చూస్తూ.. మర్యాద రామన్న ఎందుకు మౌనంగా ఉన్నట్లు..?