బీజేపీ నయా ప్లాన్ ... చిక్కుల్లో పడ్డ ప్రాంతీయ పార్టీలు ?

Update: 2019-12-13 07:00 GMT
భారతీయ జనతా పార్టీ వరుస గా కేంద్రం లో రెండోసారి సంపూర్ణ మెజారిటీ తో  అధికారంలోకి వచ్చింది. దీనితో బీజేపీ వరుసగా పలు సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగుతుంది. దశాబ్దాల తరబడి వెంటాడుతున్న సమస్యలను సాహసోపేతంగా పరిష్కరిస్తోంది. కేవలం ఆరేడు నెలల్లోనే అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుంది. అందులో అయోధ్య రామజన్మ భూమి వివాదం .. కశ్మీర్‌ కోసం రాజ్యాంగంలో నిర్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు .. తాజాగా పౌరసత్వ సవరణ బిల్లు .. త్వరలోనే కామన్‌ సివిల్‌ కోడ్‌ పైనా మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోబోతుంది అని తెలుస్తోంది.  

ఈ నేపథ్యంలోనే బీజేపీ మరో సాహసో పేత నిర్ణయం దిశగా ముందుకెళుతున్నట్లు  సమాచారం.  ఇప్పటి కే అధ్యక్ష తరహా పాలన దిశగా ఆలోచిస్తున్న బీజేపీ పెద్దలు . లోక్‌సభకు జాతీయపార్టీలు మాత్రమే పోటీ చేసేలా రాజ్యాంగ సవరణ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. దేశంలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం దిశగా దేశాన్ని నడిపించడానికిది ఇది తొలిమెట్టుగా భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రాంతీయపార్టీల మనుగడ వచ్చే రోజుల్లో కష్టంగా మారుతుంది అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు.

దేశ రాజకీయవ్యవస్థను అధ్యక్ష తరహాలోకి మార్చాలన్న ఆలోచన కూడా చేస్తోందని అంటున్నారు. అందులో భాగంగానే లోక్‌ సభకు కేవలం జాతీయ పార్టీలు మాత్రమే పోటీచేసేలా రాజ్యాంగసవరణ తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. మోదీ- అమిత్‌ షాల దూకుడుకి ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ చివరి దశకి చేరింది. కాంగ్రెస్‌ సంగతి పక్కన పెడితే, కాస్తో కూస్తో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కూడా దెబ్బ కొట్టడానికి మోడీ ద్వయం ఈ నిర్ణయం తీసుకోబోతుంది అని సమాచారం. అలాగే ప్రస్తుతం కొన్ని   ప్రాంతీయపార్టీలు జాతీయస్థాయికి ఎగబాకటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలకి అధిపత్యానికి  చెక్ పెట్టడానికే కేంద్రం ఈ దిశగా అడుగులు వేయబోతుంది అని తెలుస్తోంది. అయితే , ఈ నిర్ణయం పై  ప్రాంతీయపార్టీలు ఎలా స్పందిస్తాయో? చూడాలి. 
Tags:    

Similar News