బలహీనుడు ఎప్పటికి బలహీనుడిగా ఉండిపోడు. అందునా.. ప్రజాస్వామ్య భారతంలో అధికారం ఎప్పుడూ ఒకరి చేతిలోనే ఉండదు. ఓటమి.. గెలుపు లాంటివి చక్రంలా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మహారాష్ట్ర విషయంలో ఇప్పుడు అలాంటిదే చోటు చేసుకుంది. ఐదేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భారీగా సీట్లు రావటం.. మిత్రుడు శివసేన అవసరం లేకపోవటంతో బండిని లాగించేశారు. మిత్రుడే అయినా.. మిత్రధర్మాన్ని పెద్దగా పాటించింది లేదు.
కట్ చేస్తే.. ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్ల కంటే తక్కువ రావటం.. అదే సమయంలో మిత్రుడు శివసేనకు గతంలో వచ్చినన్ని సీట్లకు ఒకట్రెండు తక్కువ వచ్చినా.. ప్రభుత్వ ఏర్పాటుకు వారే కీలకం కావటంతో సేన ప్రాధాన్యత ఒక్కసారి మారిపోయింది.
బలం ఉన్నప్పుడు బీజేపీ నేతలు ఎలా వ్యవహరించారన్న విషయం తెలీనంత చిన్నపిల్లలేమీ కాదు శివసేన నేతలు. పట్టు ఎప్పుడుబిగించాలో.. ఎప్పుడు సడలించాలో వారికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. ఇప్పటివరకూ చేసేదేమీ లేకపోవటంతో ఏం చేసినా బదులివ్వలేని పరిస్థితి. ఇప్పుడు సీన్ మారింది. తాము తప్పించి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి తోడు ఎవరూ రాని వేళ.. తమకున్న అవకాశాన్ని వీలైనంత ఎక్కువగా పిండుకోవాలని భావిస్తోంది శివసేన. దీంతో.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చోటు చేసుకుంటుంది.
ఇలాంటివేళ.. రెవల్యూషనరీ పార్టీ ఆఫ్ ఇండియా నేత కమ్ కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మహారాష్ట్రలో ఐదేళ్లు ఆదిత్య ఠాక్రే డిప్యూటీ సీఎంగా పని చేసేందుకు శివసేన ఒప్పుకోవాలంటూ.. వారికి కాలిపోయే సలహా ఇచ్చారు. రొటేషనల్ ముఖ్యమంత్రి విధానానికి బీజేపీ నో చెబుతుందని తాను అనుకుంటున్నానని.. అదే సమయంలో ఐదేళ్ల పాటు డిప్యూటీ సీఎం పదవిని తీసుకునేందుకు ఓకే చెప్పాలన్నారు. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎంగా ఆదిత్య ఠాక్రే కావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
అథవాలే మాటలు వినేందుకు బాగానే ఉన్నా.. ఎప్పుడు బీజేపీనే పాలక వర్గంగా ఉండి.. వారి సేవలో తరించటమే కానీ.. శివసేనకు అధికార పగ్గాలు చేతికి వచ్చింది లేదు. రాక.. రాక అవకాశం వచ్చినప్పుడు సేన ఈ సూచనకు ఒప్పుకుంటుందా? అన్నది ప్రశ్న. ఈ పరిస్థితిని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే. తాళం చెవిని చేతిలో ఉన్నోడు తాళం సొంతమవుతుంది కానీ.. ‘‘కీ’’ లేనోడికి కీ పోస్ట్ ఇవ్వాలని కోరటం ఏం బాగుంటుంది చెప్పండి. ఇదే రీతిలో సాగదీస్తే.. ఇష్యూ మరో వైపుకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకైనా మంచిది కాస్త తగ్గితే బీజేపీకి మంచిదేమో అథవాలేజీ.