తెలంగాణలోని హనుమకొండలో బీజీపీ నిర్వహించనున్న బహిరంగ సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నితిన్-మిథాలీ వంటి అగ్ర సెలబ్రిటీలకు ఇప్పటికే గేలం వేసినట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో బీజేపీ అడుగులు ఎలా ఉంటాయి? పార్టీ కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు? వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారు? వంటి అనేక విషయాలు ఆసక్తిగా మారాయి.
ఈనెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించి రాష్ట్రంలో రాజకీయ అలజడికి తెరలేపిన విషయం తెలిసిందే. జూనియర్‌తో షా భేటీ చర్చోపచర్చలకు దారితీసింది. ఇక, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేపీ నడ్డా ఎలాంటి కీలక సందేశం పార్టీ శ్రేణులకు ఇవ్వబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ పాలనా వైఫల్యాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేయనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
దేశంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిపై విరుచుకుపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా లిక్కర్ స్కాంను మరోసారి.. నడ్డా తెరమీదికి తీసుకువస్తారనే సందేహాలు కూడా ఉన్నాయి. హనుమకొండకు రానున్న నడ్డా.. తొలుత నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ వెంకటనారాయణ ఇంటికి వెళ్లనున్నారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వెంకటనారాయణను కలవడం ద్వారా తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ పట్టించుకోవడం లేదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
మరోవైపు నడ్డా.. తన పర్యటనలో భాగంగా హీరో నితిన్, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌తో భేటీ కానున్నారు. అదేవిధంగా కొంత మంది సినీ ప్రముఖులు, కవులు, రచయితలతో నడ్డా సమావేశమవుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.