కర్ణాటకలో భారతీయ జనతా పార్టీని అధికారానికి దూరం చేయాలనే ఉద్దేశంతో జత కట్టిన కాంగ్రెస్ – జేడీఎస్ లోక్ సభ ఎన్నికల్లో బోల్తా పడ్డాయి. బీజేపీ వ్యూహాల ముందు కాంగ్రెస్ – జేడీఎస్ మైత్రి మంత్రం పని చేయలేదని స్పష్టం అవుతోంది. గత 2014లో కాంగ్రెస్ – జేడీఎస్ ఒంటరిగా పోటీ చేసి సాధించిన ఓట్ల కంటే 2019 ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చాయి. కర్ణాటకలోని కొప్పళ, బళ్లారి, బెంగళూరు ఉత్తర, బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గాల్లో మాత్రమే గత 2014 కంటే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ – జేడీఎస్ అభ్యర్థులు ఎక్కువ ఓట్లు సాధించారు.
మిగతా 24 స్థానాల్లో గతంలో కంటే తక్కువగా ఓట్లు వచ్చాయి. అయితే సీట్ల పరంగా చూస్తే 2014లో జేడీఎస్ 2, కాంగ్రెస్ 9 గెలువగా.. ఈసారి కూటమిగా పోటీ చేసి కేవలం రెండు స్థానాలకే పరిమితం అయ్యాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 31.88 శాతం, జేడీఎస్ కు 9.67, ఇతరులు 5.04, నోటాకు 0.71 శాతం ఓట్లు వచ్చాయి. అంతేకాకుండా 2018 విధానసభలో వచ్చిన ఓట్లు కూడా.. కాంగ్రెస్ – జేడీఎస్ సాధించలేకపోయాయి. బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యమే లేని కోలార్ పార్లమెంటు సీటును కూడా బీజేపీ కైవసం చేసుకుంది. అదేవిధంగా మండ్య పార్లమెంటులో 8 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా ఆ పార్టీ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామి ఓడిపోయారు. సుమారు 12 జిల్లాల్లో మైత్రి లెక్కలు తారుమారు అయ్యాయి.
కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో తాజా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హవా కొనసాగింది. పాత మైసూరు ప్రాంతంలోని 11 పార్లమెంటు స్థానాలకు గానూ ఎనిమిది సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాగా బెంగళూరు రూరల్ లో కాంగ్రెస్ తరఫున డీకే సురేష్, హాసన్ లో జేడీఎస్ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ, మండ్య నుంచి స్వతంత్య్ర అభ్యర్థి సుమలత గెలిచారు. అయితే గత 2014 ఎన్నికల్లో పాత మైసూరు ప్రాంతంలోని 11 ఎంపీ స్థానాలకు గానూ కాంగ్రెస్ చామరాజనగర- తుమకూరు- కోలార్- చిక్కబళ్లాపుర- బెంగళూరు రూరల్- బీజేపీ మైసూరు- బెంగళూరు ఉత్తర- బెంగళూరు దక్షిణ- బెంగళూరు సెంట్రల్- జేడీఎస్ మండ్య- హాసన్ స్థానాల్లో విజయం సాధించాయి. అయితే ఏడాది కాలంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా కాంగ్రెస్ – జేడీఎస్ చేసిందేమీ లేదని ప్రజల నమ్మకం. అంతేకాకుండా నిత్యం ప్రభుత్వ మనుగడ కోసం ఉనికి కాపాడుకునేందుకు పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ – జేడీఎస్ మధ్య అనైతిక పొత్తును పసిగట్టిన బీజేపీ ఎన్నికల బరిలో పక్కా ప్రణాళికతో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంతో విజయం సాధించింది.
గత 2014 ఎన్నికల కంటే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి పాత మైసూరు ప్రాంతంలో సుమారు 8 లక్షల ఓట్లను కోల్పోయింది. గత 2014లో కాంగ్రెస్ – జేడీఎస్ కు 78,72,330 ఓట్లు రాగా.. తాజా ఎన్నికల్లో 65,12,333 ఓట్లు వచ్చాయి. అంతేకాకుండా ఏడు సీట్ల నుంచి రెండు స్థానాలకే కాంగ్రెస్ – జేడీఎస్ పరిమితమైంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గత 2014 ఎన్నికల కంటే 25 లక్షలు పైగా ఓట్లు అధికంగా సాధించింది. పాత మైసూరు ప్రాంతంలో 2014లో బీజేపీకి 45,52,133 ఓట్లు రాగా.. ఈసారి 73,85,627 ఓట్లు వచ్చాయి. అంతేకాకుండా నాలుగు సీట్ల నుంచి 8 సీట్లకు బీజేపీ బలం పెరిగింది. బీజేపీ 16.4 శాతం అధికంగా ఓట్లు సాధించింది. 2014లో 34 శాతం ఓట్లు రాగా.. 2019లో 50.4 శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. ఈమేరకు బీజేపీ వృద్ధి సాధించిన ప్రాంతాల్లో పశ్చిమబెంగాల్ తర్వాత పాత మైసూరులోనే బీజేపీ బలం పుంజుకుంది.