వచ్చే ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని నరేంద్ర మోడీ గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటి నుండే అందుకు వ్యూహాలు మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా 74 వేల పోలింగ్ కేంద్రాల్లో పార్టీ బాగా బలహీనంగా ఉందని పార్టీ అగ్రనేతలు నిర్ణయానికి వచ్చారు. అందుకనే మోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుకుని 74 వేల పోలింగ్ కేంద్రాల్లో పార్టీని బలోపేతం చేయటంపై దృష్టిపెట్టారు.
ఇందులో భాగంగానే నలుగురు నేతలతో ఒక టాస్క్ ఫోర్స టీమును ఏర్పాటు చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి - ఉపాధ్యయుడు బైజయంత్ పాండా - దిలీప్ ఘోష్ - ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యాలు ఈ టీములో పనిచేస్తారు.
2014, 19 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, పోలింగ్ కేంద్రాల వారిగా వచ్చిన ఓట్లను ఆధారం చేసుకుని 74 వేల పోలింగ్ కేంద్రాల్లో పార్టీ బలహీనంగా ఉందని వీళ్ళు నిర్ణయానికి వచ్చారు.
అందుకనే నలుగురు సభ్యులతో టాస్క్ ఫోర్స్ వేసి పర్యటించమని చెప్పారు. నలుగురు సభ్యుల టీము నాలుగు నెలలపాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. 74 వేల పోలింగ్ కేంద్రాలున్న రాష్ట్రాలు - జిల్లాలు - నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి స్ధానిక నేతలతో భేటీ అవుతుంది.
పార్టీ వాస్తవ పరిస్ధితిని వివరించి బలోపేతం అయ్యేందుకు దిశా నిర్దేశం చేస్తుంది. ఈ మొత్తంలో గమనించాల్సిందేమంటే 74 వేల పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా దక్షిణాదిలోనే ఉన్నాయి.
ఇదే సందర్భంలో పార్టీ ఇప్పటివరకు గెలవని స్థానాలు 100 ఉన్నాయి. వీటిల్లో కూడా అత్యధికం దక్షిణాదిలోనే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ - ఏపీ - తమిళనాడు - కేరళ - కర్నాటకలో పార్టీ బలం మొదటి నుండి అంతంత మాత్రంగానే ఉంది. వీటిల్లో కర్నాటకలో పరిస్థితి కాస్త మెరుగు.
తర్వాత తెలంగాణాలోనే పార్టీకి కాస్త బలముంది. పరిస్ధితి మరీ అన్యాయంగా ఉన్నది తమిళనాడు - ఏపీ - కేరళలోనే అని అగ్రనేతలు గుర్తించారు. అందుకనే దక్షిణాదిపై బాగా దృష్టి పెట్టారు. మరి వీళ్ళ కృషి ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.