బీజేపీ పోలింగ్ ఏజెంట్స్ ఫ‌ర్ `సేల్‌`!?

Update: 2021-04-10 08:40 GMT
ఎన్నిక‌లు ఏవైనా.. ఎక్క‌డ జ‌రిగినా.. పోలింగ్ ఏజెంట్ల‌కు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఈ క్ర‌మంలో అన్ని పార్టీలు బ‌ల‌మైన వారిని ఏజెంట్లుగా పెట్టుకుంటాయి. ఇక‌, ఇప్ప‌డు తెలంగాణ‌లో నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ స్థానానికి, తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీ రెండు చోట్ల గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే.. బీజేపీకి పెద్ద ఇబ్బంది ఎదురైంది. ఎలాగంటే.. ఈ ఎన్నిక‌ల్లో పోలింగ్ ఏజెంట్లు బీజేపీకి ల‌భించ‌డం లేదు. దీంతో నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

మ‌రి దీనికి కార‌ణం ఏంటి?  అనే విష‌యాన్ని బీజేపీ నేత‌లు ఆలోచిస్తున్నారు. అధికార పార్టీ వాళ్ల వ‌ల్లే.. త‌మ‌కు మ‌నుషులు ల‌భించ‌డం లేద‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో అధికార పార్టీ వారినే త‌మ ఏజెంట్లుగా పెట్టుకుని న‌డిపించేద్దాం.. అని చెప్పుకొంటున్నార‌ట‌. ఎందుకంటే.. ఉప ఎన్నిక‌ల్లో లోక‌ల్ బీజేపీ కంటే నాన్ లోక‌ల్ వాళ్లు ఎక్కువ‌గా ఉన్నారు. వారి హ‌డావుడి కూడా ఎక్కువ‌గా ఉంది. మీడియాకు టీఆర్ పీ రేటింగ్ కావాలి కాబ‌ట్టి.. బీజేపీ వాళ్ల‌ను తెగ చూపిస్తున్నారు. దీంతో అస‌లు విష‌యం లేద‌ని తేట‌తెల్లం అయింది.

అంటే.. బీజేపీకి లోక‌ల్ నేత‌లు లేరు.. అందుకే ఎక్క‌డ నుంచో నేత‌ల‌ను తెప్పించుకుని ప్ర‌చారం చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో బీజేపీకి ఏజెంట్లు దొర‌క‌డం లేదు.  దీంతో అధికార వాళ్ల‌నే పెట్టుకుని.. బూత్ ఖ‌ర్చుల‌కు ఇంత అని అప్ప‌జెబుతున్న‌ట్టు విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తోంది. అయితే.. దీనిపై బీజేపీ నేత‌లు స్పందిస్తూ.. మేమే వారిని నిల‌బెట్టాం ఖ‌ర్చు మేమే ఇస్తున్నాం అని చెబుతున్నారు. అయితే.. విష‌యం మాత్రం అలా లేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప‌రిస్థితి ఇలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  ఏదేమైనా .. రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని ఆశ ఉన్నా.. ఆ విధ‌మైన వ్యూహాలు.. మ‌నుషులు కొర‌వ కావ‌డం ఇప్పుడు బీజేపీకి పెద్ద మైన‌స్ కావ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News