తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు - ముషీరాబాద్ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది. నిఘావర్గాలు అందించిన ఈ సమచారంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఒక్కసారిగా భద్రత పెంచింది. హైదరాబాద్ సిటీలో ఉగ్రవాదుల జాడలు బాగా పెరిగిన నేపథ్యంలో బీజేపీ నేత అయిన లక్ష్మణ్ కు భద్రత పెంచారు. ఇందులో భాగంగా ఆయనకు పోలీసు రక్షణను రెట్టింపు చేశారు. ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా కేటాయించారు.
హైదరాబాద్ లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేసిన ఉగ్రవాదులు వారం కిందట దొరికిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. ఉగ్రవాదుల ఇంకా ఉండవచ్చని.. వారు బీజేపీ నేతలను టార్గెట్ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. నిఘావర్గాలు కూడా ఇందుకు సంబంధించి పక్కా సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా లక్మణ్ ఐఎస్ ఐఎస్ హిట్ లిస్టులో ఉన్నారని తెలుస్తోంది.
గతంలోనూ బీజేపీ నేతల ఇళ్ల వద్ద ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారనడానికి ఆధారాలున్నాయి. ఐఎస్ టెర్రరిస్టులు ముస్లిమేతర పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో అత్యధిక ముప్పు లక్ష్మణ్ కే ఉందని పోలీసులు చెబుతున్నారు. అందులో భాగంగానే ముందు జాగ్రత్తకు ఆయనకు గట్టి భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.