రేవంత్ చెప్పింది మాకు గుడ్ న్యూసే - ల‌క్ష్మ‌ణ్‌

Update: 2017-09-12 11:50 GMT
టీడీపీ - బీజేపీల మ‌ధ్య ఉన్న‌ది చిత్ర‌మైన దోస్తీ అని ఇటీవ‌ల రాజ‌కీయ‌వ‌ర్గాలు విశ్లేషిస్తున్న తీరుకు తాజా నిద‌ర్శ‌నం ఇది! 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం ఢిల్లీలో - ఏపీలో అధికారం పంచుకుంటున్న సైకిల్ పార్టీ నేత‌లు - క‌మ‌ళ‌నాథులు తెలంగాణ విష‌యంలో మాత్రం సూప‌ర్ ట్విస్ట్ ఇస్తున్నారు. ఒక పార్టీతో మ‌రో పార్టీ ఏ మాత్రం సంబంధం లేని రీతిలో సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నారు. 2019 ఎన్నిక‌ల విష‌యంలో ఒక‌రు క్లారిటీ ఇచ్చేస్తే...ఇంకొక‌రు క‌రాఖండీగా త‌మకు దోస్తీ ప‌ట్ల పెద్ద ఇంట్ర‌స్టేమీ లేద‌ని తేల్చిచెప్పేశారు. పైగా మాతో క‌ల‌వ‌ట్లేద‌ని చెప్ప‌డం సంతోష‌క‌ర‌మ‌ని కూడా వ్యాఖ్యానించారు.

హైద‌రాబాద్‌ లో నిన్న‌ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ  బీజేపీ నాయకులు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు.ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టామని చెప్పుకొంటున్న మిషన్‌ భగీరథ పథకంలో అవినీతి చోటుచేసుకుందని రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శిస్తుంటే.. మరో వైపు కేంద్రమంత్రులు - బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ మోడీ కేసీఆర్‌ పాలనను - మిషన్‌ భగీరథను పొగడటం ఎంత వరకు సమంజసమన్నారు. స‌లు బీజేపీ శాఖ తెలంగాణ‌లో ఉండి చేస్తోంది ఏమిట‌ని రేవంత్ ఎద్దేవా చేశారు. బీజేపీతో రాబోయే ఎన్నిక‌ల్లో కలవాల్సిన అవసరం తమకు లేదని అన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు - ఎమ్మెల్యే ల‌క్ష్మ‌ణ్ ఎంట్రీ ఇచ్చారు.

బీజేపీతో పొత్తు గురించి టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ స్పందిస్తూ...బీజేపీతో కలవబోమని రేవంత్‌ చెప్పటం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ ఎస్‌ ముసుగులో టీడీపీ పాలన సాగుతోందని విమర్శించారు. గ‌తంలో టీడీపీ నేత‌లు చెప్పిన మాట‌ల‌నే చెప్తూ విలీన దినోత్స‌వాన్ని ప‌క్క‌న‌పెడుతున్నార‌ని ల‌క్ష్మ‌ణ్‌ మండిప‌డ్డారు. పార్టీలు మారిన వాళ్ల అన్ని స్థానాల్లో ఉప ఎన్నికలు జరగాలని అన్నారు.
Tags:    

Similar News