ఫామ్ హౌస్ పేరుతో తిట్టుడు కాదు..సీక్రెట్ చెప్పు?

Update: 2018-10-03 05:13 GMT
ఒక ముఖ్య‌మంత్రి త‌న క్యాంప్ ఆఫీస్ కాదంటే.. స‌చివాల‌యంలో ఉండ‌టం కామ‌న్‌. కానీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌టం తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు మాత్ర‌మే చెల్లుతుంది. త‌న నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో ప‌ట్టుమ‌ని ప‌దిసార్లు కూడా స‌చివాల‌యానికి వెళ్ల‌ని ఏకైక ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ రికార్డు సృష్టించిన‌ట్లుగా ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు ఎద్దేవా చేస్తుంటారు.

స‌చివాల‌యానికి వెళ్ల‌కుండా ఫామ్ హౌస్ లో ఎక్కువ కాలం గ‌డుపుతార‌ని కేసీఆర్‌ పై విమ‌ర్శ‌ల్ని అంత‌కంత‌కూ పెంచుతున్నారు. తాజాగా ఆ లిస్ట్‌ లో చేరారు తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రోజూ 18 గంట‌లు ప‌ని చేస్తుంటే.. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ 18 గంట‌లూ ఫామ్ హౌస్ లోనే ఉంటార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

అంద‌రి మాదిరి కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి విమ‌ర్శ‌ల‌తో నోరు పారేసుకునే బ‌దులు.. అక్క‌డ కేసీఆర్ ఏం చేస్తారు?  ఆయ‌న ఎందుకంత ఎక్కువ‌గా అక్క‌డే ఉంటార‌న్న జ‌నాస‌క్తిని ప్ర‌జ‌ల‌కు పంచొచ్చుగా అన్న మాట ప‌లువురి నోటి నుంచి వినిపిస్తోంది. మిగిలిన పార్టీల‌కు బీజేపీకి ఒక తేడా ఉంద‌ని.. గ‌తంలో క‌మ్యూనిస్టుల‌లో క‌మిట్ మెంట్ ఉండే కార్య‌క‌ర్త‌లు.. నేత‌లు ఉండేవారు. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి బీజేపీలో ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌ని చెబుతారు.

బీజేపీకి చెందిన కార్య‌క‌ర్త‌ల్ని గ‌మ‌నిస్తే.. వారికి పార్టీ ప్ర‌యోజ‌నాల‌కు మించి మ‌రింకేమీ ప‌ట్ట‌వ‌ని.. పార్టీకి సైనికులుగా వ్య‌వ‌హ‌రించే అల‌వాటున్న కార్య‌క‌ర్త‌ల బేస్ తో.. ఎక్క‌డెక్క‌డి ర‌హ‌స్యాల్ని సేక‌రిస్తార‌ని చెబుతారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఫామ్ హౌస్ గుట్టును ల‌క్ష్మ‌ణ్ లాంటి నేత‌లు విప్పితే సంచ‌ల‌నంగా ఉంటుందంటున్నారు. అయినా.. ర‌హ‌స్య స్నేహితుడ్ని రాజ‌కీయంగా త‌ప్పు పట్టేలా విమ‌ర్శిస్తారే కానీ.. ప్ర‌యోజ‌నాలు దెబ్బ తినేలా బ‌ద్నాం చేస్తారా ఏంది?


Tags:    

Similar News