ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌- త్రిపుర సీన్ తెలంగాణ‌లోనా!

Update: 2018-03-04 09:23 GMT
జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా...తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామ‌ని...అందుకు అవ‌స‌ర‌మైతే తానే నాయ‌కత్వం వ‌హిస్తాన‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. తాజాగా పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నోరు జారాడు అని కేటీఆర్  - కవితే చెప్పారని చేసిన పొరపాటు ను కేసీఆర్ హుందాగా ఒప్పుకోవాలని ఆయ‌న కోరారు. త్రిపురలో గతంలో ఒక్క ఎమ్మెల్యే లేకున్నా అధికారంలోకి వచ్చామని ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని కేసీఆర్ కు గుబులు పట్టుకుందని వ్యాఖ్యానించారు. ఫ్ర‌స్టేషన్ తో కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ విజయదాటికి తట్టుకోలేక ఫ్రంట్ లని కేసీఆర్ అంటున్నారని - ఫ్రంట్‌ ల‌కు టెంట్లు కూడా లేవ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఓటమి ఛాయల ఉన్న పార్టీలను తీసుకువచ్చి ఫ్రంట్ ఏర్ప‌ చేస్తామంటున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ఈ ఫ్రంట్‌లను చాలా చూశామ‌ని ల‌క్ష్మ‌ణ్ పేర్కొంటూ ఈ ఫ్రంట్‌ లు ఎలా మూడున్నాళ్ల‌ ముచ్చట అయిందో అందరికి తెలుస‌న‌ని వ్యాఖ్యానించారు.

70 సంవత్సరాలు చేయని అభివృది 4 సంవత్సరాలో మోడీ చేసి చూపించారని ల‌క్ష్మ‌ణ్ తెలిపారు. అందుకే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు వ‌చ్చాయ‌ని వివ‌రించారు. కమ్యూనిస్టుల బెదిరింపు రాజకీయాలకు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. దేశంలో 21 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామని కర్ణాటకలో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. కేసీఆర్ పాలనలో ఆ నలుగురే బాగుపడ్డారని ల‌క్ష్మ‌ణ్  ఆరోపించారు. బీజేపీ మినహాయిస్తే అన్ని పార్టీలతో టీఆర్ ఎస్ అంటకాగిందని దుయ్య‌బ‌ట్టారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమ‌ర్శించారు. కేసీఆర్ వాపును చూసి బలుపు అనుకుంటున్నారని అన్నారు. అంగట్లో కొన్న విధంగా ఎమ్మెల్యేలను కొన్నారని ఇదా గుణాత్మక పాలనా అని ల‌క్ష్మ‌ణ్ ప్ర‌శ్నించారు.

కేసీఆర్ ఫ్రంట్ లని మాట్లాడుకుంటే జనాలు నవ్వుతున్నారని ల‌క్ష్మ‌ణ్  వ్యాఖ్యానించారు. `ప్రతిపక్షాలకు,ప్రజాసంఘలకు అవకాశం ఇవ్వని మీ పాలన గుణాత్మక పాలనా? రైతులకు బేడీలు - నేరేళ్ల దళితులపై దాడి గుణాత్మపాలనా కేసీఆర్ చెప్పాలి` అని అన్నారు. మోడీ పాలనా గుణాత్మక పాలన అని వివ‌రించారు. `తెలంగాణలో గడిలా పాలన నుండి ప్రజలు విముక్తి పొందలనుకుంటున్నారు. కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఆదాయ వనరు అయినా హైదరాబాద్ కు కేసీఆర్ ప్రభుత్వము ఎంత కేటాయిస్తున్నారు? ముస్లిం రిజర్వేషన్ ల పై కేసీఆర్ డ్రామాకు తెరలేపారు. కేసీఆర్ రిజర్వేషన్ మోసాలను ముస్లిం సోదరులు గ్రహిస్తున్నారు. కేసీఆర్ వైఫల్యాలను కప్పిపుచుకోడానికి కేంద్రం పై నిందలు వేస్తున్నారు. కేంద్ర నిధులు ఇచ్చిన ఎన్ని పనులు ఆగిపోయాయో అసెంబ్లీ లో చర్చపెడితే చర్చకు బీజేపీ సిద్ధం. మిషన్ భగీరథకు -మిషన్ కాకతీయకు ఎంత బడ్జెట్ కేటాయించారో కేసీఆర్ చెప్పాలి వాటి పై కూడా చర్చ చేద్దాం.` అని ల‌క్ష్మ‌ణ్ స‌వాల్ విసిరారు.

ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన ఎంఐఎం చేరుతుందని ఆ పార్టీ కూడా త‌మ‌ను విమ‌ర్శించ‌డం ఏమిట‌ని ప్రశ్నించారు. `దమ్ముటే ఎంఐఎం తెలంగాణ అంతట పోటీ చేయాలి. ఎవరి బలం ఎంతో తేల్చుకుంటాం. ఎంఐఎంను సమర్థవంతంగా ఎదురుకోవాలంటే బీజేపీ కే సాధ్యం. కాంగ్రెస్-ఎంఐఎం-టీఆర్ ఎస్ లు అంత ఒక్కటే. మోడీ పథకాలను పల్లె పల్లె కు తీసుకవేల్లుతాము,రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తాం` అని ల‌క్ష్మ‌ణ్ ప్ర‌క‌టించారు.

Tags:    

Similar News