సినిమా పరిశ్రమకు చెందిన వారు రాజకీయాల్లోకి వెళ్లడం కొత్తేమి కాదు. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషలకు చెందిన సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే రాజకీయాల్లోకి వెళ్లారు. ఇంకా కూడా రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారు. మరి కొందరు సినీ మరియు రాజకీయ రంగాల్లో కొనసాగుతున్నారు. వందల కొద్ది సినీ ప్రముఖులు స్టార్స్ రాజకీయాల్లోకి వెళ్లారు. కాని పది పదిహేను మంది మాత్రమే ఉన్నత పదవులను అధిరోహించారు. కారణం రాజకీయ నాయకుల స్థాయిలో సినిమా స్టార్స్ నటించలేరు అనేది విశ్లేషకుల అభిప్రాయం. వెండి తెరపై తమ నటనకు అవార్డులు అందుకున్న వారు కూడా రాజకీయ రంగస్థలంపై మాత్రం నటించలేక చతిగిల్లపడుతున్నారు. తాజాగా మలయాళ నటుడు సురేష్ గోపీ అందుకు మరో ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కేరళ రాష్ట్ర బీజేపీ రాజ్యసభ సభ్యుడు అయిన సురేష్ గోపీ తాజాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గురువాయుర్ మరియు తలసెరి అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి అయిన యూడీఎఫ్ కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్కడ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ లు తిరష్కరణకు గురి అయ్యాయి. దాంతో అక్కడ యూడీఎఫ్ కు పోటీ లేదని తప్పకుండా ఆ కూటమి అభ్యర్థులే గెలుస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు.
ఆ విషయాన్ని ప్రచారంలో భాగంగా సురేష్ గోపీ కడుపులో దాచుకోవాల్సింది పోయి బయటకు చెప్పేశాడు. దాంతో సురేష్ గోపీ పై సొంత పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ గెలుస్తుందని వ్యాఖ్యలు చేయడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయకత్వంతో సురేష్ గోపీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవ్వడంతో ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ మరియు బీజేపీలు కలిసి పోయాయి అంటూ ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి డ్యామేజీ అంటూ ఆ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమాయకత్వంతో సురేష్ గోపీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిఫలం గట్టిగానే ఎదుర్కోవాల్సి వచ్చింది.