బీజేపీ విరాళాలివీ.. దిమ్మదిరగాల్సిందే..

Update: 2019-07-11 01:30 GMT
దేశంలో అధికారంలో ఉన్న పార్టీ. ఐటీ - ఈడీ సహా ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ గుప్పిట పార్టీ పార్టీ బీజేపీ. ఇప్పుడా పార్టీ అధికారంలో ఉండడంతో అంబానీ నుంచి అదానీ దాకా చిన్నా పెద్ద పారిశ్రామికవేత్తలు బీజేపీకి కొమ్ముకాయాల్సిందే. లేదంటే ఏ రకంగానైనా ఇబ్బందులు తప్పవు. అందుకే కార్పొరేట్ సంస్థల నుంచి వ్యాపార సంస్థల దాకా బీజేపీకి విరాళాలు వెల్లువెత్తాయి.

తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తాజా రిపోర్ట్ సంచలనం సృష్టిస్తోంది. దేశంలోని ఆరు జాతీయ పార్టీలకు గత రెండేళ్లలో ఇచ్చిన విరాళాలను బయటపెట్టింది. దాదాపు రూ.1059.25 కోట్ల విరాళాలు దేశంలోని ఆరు జాతీయ పార్టీలకు వచ్చాయని తెలిపింది. అందులో కేవలం అధికారంలో ఉన్న బీజేపీకే 985.18 కోట్లు వచ్చాయని తెలిపింది. 20వేల కంటే ఎక్కువ మొత్తాలను లెక్కలోకి తీసుకొని ఈ లెక్కలు చెప్పింది.

దేశవ్యాప్తంగా వచ్చిన 1000 కోట్లకు పైగా విరాళాల్లో 94శాతం బీజేపీకే దక్కడం విశేషం. ఇవన్నీ ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారానే రావడం గమనార్హం. ఇవి కార్పొరేట్ల నుంచి నిధులు సేకరించి ఆ డబ్బును నేరుగా పార్టీ ఖాతాల్లోకి తరలిస్తాయి. దాదాపు 1731 సంస్థలు బీజేపీకి విరాళాలు ఇచ్చినట్టు తెలిపింది.

ఇక కాంగ్రెస్ కు 68.56 కోట్లు విరాళంగా వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ కు 2.35 కోట్లు - అత్పల్పంగా 2.59 కోట్లు సీపీఐకి వచ్చాయి. ఈ నిధులు కేవలం 2 శాతం మాత్రమే కావడం గమనార్హం. యూపీ బీఎస్పీకి 20వేలకు మించి విరాళాలు రాకపోవడం కొసమెరుపు. పార్టీలకు అందుతున్న నిధుల్లో ఎక్కువ శాతం ఢిల్లీ నుంచే రావడం విశేషం.


Tags:    

Similar News