ఏపీలో బీజేపీ ప్రజా సమస్యల మీద పోరాడడం కంటే ఇతర విషయాల మీదనే ఆసక్తిని ఎక్కువగా చూపుతుందని విమర్శలు ఉన్నాయి. అన్నమో రామచంద్రా అంటూ బీదా బిక్కీ ఏడుస్తూ ఉంటే కాషాయదళం మాత్రం అయోధ్య రామాలయాన్ని ఇప్పటిదాకా చూపిస్తూ రావడం అందరికీ తెలిసిందే. ఇపుడు కూడా ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. కరోనా రెండు విడతల తరువాత చూసుకుంటే ఆర్ధిక సంక్షోభం బాగా ఎక్కువ అయిపోయింది. ద్రవ్యోల్బణం కూడా దారుణంగా పెరిగిపోయింది. దాంతో చిరుద్యోగులు నిరుద్యోగులు అయిపోయారు. మధ్య తరగతి వర్గాలు అధోగతిపాలు అయ్యారు. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ వారికి ఓదార్పుగా కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వాన్ని తట్టి లేపడం, నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వడం చేస్తే బాగుంటుంది అని అంతా భావిస్తారు. కానీ బీజేపీ మాత్రం తన రూట్ సెపరేట్ అని మరో మారు నిరూపించుకుంటోంది.
తాజాగా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు రాష్ట్రంలోని గుళ్ళూ గోపురాలను పట్టుకుని తిరుగుతున్నారు. ఆయన ప్రముఖ పుణ్య క్షేత్రాలను పట్టుకుని తిరుగుతున్నారు. దీని వల్ల పుణ్యమే కాదు రాజకీయ లాభమేదో ఉంటుందని భావిస్తున్నట్లుగా ఉంది మరి. సోము వీర్రాజు విజయవాడలోని కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. గుంటూరులోని త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇలా వరసలో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఆలయ్యాన్ని కూడా సందర్శించారు. పనిలో పనిగా పుష్కరాలలో కూలగొట్టిన ఆలయాలు అన్నీ కూడా నిర్మించాలని జగన్ సర్కార్ ని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఈ ఆలయాలను కూలగొట్టింది టీడీపీ ప్రభుత్వం. నాడు చంద్రబాబు జమానాలో దేవదాయ మంత్రిగా ఉంది బీజేపీకి చెందినవారే. మరి వీటిని విస్మరించి మరీ సోము కొత్తగా డిమాండ్లు చేస్తున్నారు. ఇలా ఒక్కసారిగా సోము వీర్రాజు దేవాలయాల వైపు తిరిగడం పట్ల చర్చ సాగుతోంది.
ఏపీలో బీజేపీ మళ్లీ హిందూత్వ కార్డుతోనే ముందుకు రావాలి అనుకుంటోందా ? అన్న మాట కూడా వినిపిస్తోంది. ఏపీలో ప్రజల సమస్యలు పరిష్కరించడం. వారి మనసు గెలుచుకుని ఆ దిశగా అడుగులు వేయడం బీజేపీ లాంటి పార్టీలకు కష్టంగా తోస్తోందా ? అన్న మాట కూడా ఉందిపుడు. నిజమే ఎంతలా ప్రజలను పట్టుకుని తిరిగినా వారు తమ వైపు తిరుగుతారన్న నమ్మకం బీజేపీ సహా ఏ పార్టీకి లేదు. ఏపీకి బీజేపీ గత ఏడేళ్లుగా చేస్తోన్న ద్రోహం సామాన్య ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. అందుకే బీజేపీకి ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాకుండా జాగ్రత్త పడ్డారు.
అసలు బీజేపీతో ఎవరు కలిస్తే వాళ్లు బద్నాం అయిపోయేలా ఉన్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌ను ఢీ కొట్టేందుకు పెద్దన్న అయిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ షార్ట్ కట్ మెదడ్స్ ని అనుసరిస్తూంటే, బీజేపీ మరో వైపు సున్నితమైన సెంటిమెంట్లను సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. మొత్తానికి అందరూ దొందుకు దొందే అన్నట్లుగా ఉన్నారు. మరి బీజేపీకి ఏపీలో హిందూత్వ విత్తనాలకు ఓట్ల పంట పండుతుందా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.