3 రాజధానులపై స్పందించిన బీజేపీ

Update: 2019-12-18 04:47 GMT
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అవసరమని సీఎం జగన్ చేసిన ప్రతిపాదన పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనసభ స్థానం నుంచి పరిపాలన స్థానాన్ని వేరు చేయవద్దని స్పష్టం చేశారు. దీనికి బీజేపీ అంగీకరించదని స్పష్టం చేశారు.

శాసనసభ ఒక చోట, సచివాలయం మరో చోట ఏర్పాటు చేయడం పిచ్చి ఆలోచన అని కన్నా అన్నారు. ఇటువంటి విధానం రాష్ట్రం మొత్తం ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతిస్తోందని కన్నా అన్నారు.

కేవలం ఆరు నెలల్లోనే సీఎం జగన్ పరిపాలనపై నియంత్రణ కోల్పోయారని కన్నా ధ్వజమెత్తారు. జగన్ తన అనుభవరాహిత్యం, నిర్లక్ష్యం కారణంగా ఏపీని 20 ఏళ్లు వెనక్కి నెడుతున్నారని కన్నా ఆరోపించారు.

ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీలు ఘోరంగా విఫలమయ్యాయని.. ఏపీ ప్రయోజనాలు పరిరక్షించడం లో జగన్, చంద్రబాబు ఫెయిల్ అయ్యారని కన్నా అన్నారు. బీజేపీతోనే ఏపీ ప్రయోజనాలు దక్కుతాయని వివరించారు.జగన్ రాజధానిని అమరావతి నుంచి మార్చితే బీజేపీ మౌనంగా కూర్చోదని కన్నా హెచ్చరించారు. అసెంబ్లీ, సచివాలయం అమరావతిలోనే ఉండాలని కన్నా స్పష్టం చేశారు. 
Tags:    

Similar News