బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుకు రోజుకో మలుపు తిరుగుతుంది. సుశాంత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్ రావు వరుస ట్వీట్లు చేశారు. భారతదేశ ప్రజలు ఈ కేసును ఆసక్తిగా గమనిస్తున్నారన్న ఆయన.. ఈ కేసు చుట్టూ అనేక అనుబంధకేసులు పుట్టుకొస్తుండటంతో సుశాంత్ సూసైడ్ కేసు పరిధి బాగా పెరిగిపోయిందన్నారు.
దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందన్నారు. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం, హఠాన్మరణం గురించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తోంది, మనీలాండరింగ్ మీద ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఫలితంగా కేసు మరింత పెద్దదవుతూ వేర్వేరు కేసులను కనెక్ట్ చేస్తుందని మురళీధర్ రావు అభిప్రాయపడ్డారు. అసలేం జరుగుతుందోనని యావత్ భారతదేశం ఆసక్తిగా చూస్తోందని, ఈ కేసుకు సంబంధించి ఎవరైతే సహాయసహకారాలు అందిస్తున్నారో వాళ్లంతా కేవలం సుశాంత్ కు న్యాయం చేయాలన్న తలంపే కాకుండా క్లీన్ బాలీవుడ్ మూమెంట్ కు సహకరిస్తున్నారని మురళీధర్ రావు అన్నారు.
సీబీఐ తాజాగా సుశాంత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తికి సమన్లు జారీ చేసింది. ఈ రోజు సీబీఐ విచారణకి హాజరు కావాలని నోటిసులు జారీ చేయడంతో ఆమె ఈరోజు ముంబైలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.. ఆమెతో పాటుగా సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానీ కూడా మరోసారి ప్రశ్నించనుంది సీబీఐ.. సుశాంత్ ది ఆత్మహత్యా లేదా హత్య అన్న కోణంలో సీబీఐ తమ దర్యాప్తును కొనసాగిస్తుంది. రియా చక్రవర్తి పైన సుశాంత్ తండ్రి కేకే సింగ్ పలు ఆరోపణలు చేశారు.. తాజాగా ఓ వీడియోలో మాట్లాడిన అయన రియా చక్రవర్తి తన కుమారుడిని చంపిన హంతకురాలని అంటూ కామెంట్స్ చేశారు.. చాలా రోజులుగా రియా చక్రవర్తి నా బిడ్డకు విషం ఇచ్చిందని, ఆమె ఒక హంతకురాలని, ఆమెను, ఆమె అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి' ఆయన డిమాండ్ చేశారు.