దేశవ్యాప్తంగా పెట్రో ధరలపై నిరసనలు వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో మోడీ సర్కార్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. దేశంలో రోజురోజుకీ ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం కాస్త కరుణించింది. ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
చమురు, గ్యాస్ పన్నులు తగ్గించి దేశ ప్రజలను మోడీ సర్కార్ కాస్తా కనుకరించింది. లీటర్ పెట్రోల్ పై రూ. 8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా తగ్గింపుతో లీటర్ పెట్రోల్ పై రూ.9.50లు, డీజిల్ పై రూ.7 తగ్గే అవకాశం ఉంది.
మరో వైపుపీఎం ఉజ్వల్ యోజన పథకం కింద 9 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్ పై రూ.200 రాయితీ ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఐరన్, స్టీల్ పై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడి పదార్థాలతోపాటు ఉక్కు ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించినట్టు తెలిపింది.
ఇప్పటికే పెట్రో, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ప్లాస్టిక్, సిమెంట్, ముడి పదార్థాలపై సుంకం తగ్గించనున్నట్లు తెలిపారు.
స్టీల్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించనున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా దేశంలో సిమెంట్, స్టీల్ కొరత తగ్గిధరలు తగ్గుతాయని తెలిపారు. తద్వారా గృహ నిర్మాణ వ్యయం భారీగా తగ్గుతుందని చెప్పారు. తగ్గించిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి.
గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గింపు గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ సిలిండర్ల ధరలను కేంద్రం రూ.200 తగ్గించింది. పీఎం ఉజ్వల యోజన కింద కనెక్షన్ తీసుకున్న వారికి రూ.200 సబ్సిడీ ఏడాదికి 12 సిలిండర్లకు వర్తిస్తుంది. ఈ తగ్గింపుతో 9 కోట్ల వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. ఈ తగ్గింపుతో ప్రస్తుతం హైదరాబాద్ లో రూ.1003 గా ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.800కు దిగిరానుంది.