తెలంగాణలో బలోపేతం పై దృష్టి సారించిన బీజేపీ.. కేసీఆర్ వ్యూహాన్నే అనుసరించి ఆయనకు చెక్ పెట్టాలని చూస్తుందని తెలిసింది. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో జయకేతనం ఎగరేసి జోరు మీదున్న బీజేపీ.. ఇదే జోష్‌తో తెలంగాణలోనూ పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దక్షిణాదిలో తమకు అనుకూలంగా మారుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఈసారి కచ్చితంగా అధికారం దక్కించుకోవాలని భావిస్తోంది. అందుకే ఈ నెల 22న అనంతగిరి కొండల్లో 200 మంది నేతలతో బీజేపీ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు.. టీఆర్ఎస్‌ను అడ్డుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో కార్యచరణ సిద్ధం చేయనున్నట్లు సమాచారం.
అదే వ్యూహంతో దెబ్బ
మరోవైపు ఎన్నికల్లో కేసీఆర్ సాధారణంగా అనుసరించే ఓ వ్యూహాన్ని తాము కూడా అమలు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల వరకూ ఎదురు చూడకుండా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టడం కేసీఆర్ ప్రత్యేకత. 2018లో ఇదే రకమైన వ్యూహంతో సీఎం కేసీఆర్ ప్రత్యర్థులపై పైచేయి సాధించారు. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసుకునేలోపే ఆయన ఎన్నికల కదనరంగంలోకి దిగి దూసుకుపోయారు. మరోసారి ఆయన ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన దూకుడుకు చెక్ చెప్పేందుకు బీజేపీ కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ముందుగానే సిద్ధం..
వచ్చే ఎన్నికల కోసం ముందుగానే సిద్ధమవుతున్న బీజేపీ ఇప్పటికే 60 నియోజకవర్గ స్థానాలకు అభ్యర్థులను ఖారారు చేసిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వాళ్లనే ఆయా నియోజకవర్గాలకు ఇంఛార్జీలుగా ప్రకటించబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంఛార్జ్‌లను ప్రకటించడం ద్వారా.. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ సంకేతాలు ఇవ్వనుందని.. అదే సమయంలో తమ వ్యూహం అధికార టీఆర్ఎస్‌పై ఒత్తిడిని పెంచుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.
అమిత్ షా నుంచి..
తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ నేతలు, ప్రత్యేకించి అమిత్ షా స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వనున్నారని.. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర బీజేపీ నాయకత్వం ముందుకు సాగనుందనే చర్చ కూడా సాగుతోంది. తెలంగాణలో ఈసారి టీఆర్ఎస్‌కు బలమైన పోటీ ఇవ్వాలని భావిస్తున్న బీజేపీ.. ఇందుకోసం ఎలక్షన్ మేనేజ్‌మెంట్ విషయంలో పక్కాగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్న వర్గాలను ఆకర్షించడంతో పాటు ఎలక్షన్ మేనేజ్‌మెంట్ విషయంలో ఏ మాత్రం పొరపాటు జరగకుండా చూడాలని బీజేపీ యోచిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.