సీమ‌లో.. బీజేపీ.. పేల‌ని ట‌పాకాయ్!

Update: 2022-02-02 06:36 GMT
రాయ‌ల‌సీమ‌.. నాలుగు జిల్లాల స‌మాహారంగా.. క‌నిపించే ఈ సీమ ప్రాంతాన్నికి ఎంతో ప్ర‌త్యేకత ఉంది. రాజ కీయంగా..ఇక్క‌డ నుంచి న‌లుగురు సీఎంలు.. ఉమ్మ‌డి రాష్ట్రంలో చ‌క్రం తిప్పారు. ఇప్పుడు కూడా జ‌గ‌న్ అక్క‌డి వారే. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయాలంటే..మ‌క్కువ‌. ఒక్క‌సారి న‌మ్మారా?  ఆ నాయ‌కుడిని ద‌శాబ్దాల పాటు నెత్తిన పెట్టుకుంటారు. అందుకే... ఇత‌ర ప్రాంతాల్లో క‌న్నా.. కూడా సీమ‌లో ఒకే నియోజ‌క వ‌ర్గం నుంచి ఎక్కువ సార్లు గెలిపొందిన నాయ‌కులు ఉన్నారు. అంటే.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయాల నుంచి కావాల్సిం ది.. న‌మ్మకం.

నేత‌ల నుంచి అవ‌స‌ర‌మైంది..ఇచ్చిన మాట‌ను త‌ప్ప‌క‌పోవ‌డం. ఈ నేప‌థ్యంలోనే కీల‌క పార్టీల‌కు సీమ రాజ‌కీయ అంబ్రెల్లాగా మారింద‌నే కామెంట్లు త‌ర‌చుగా వినిపిస్తుంటాయి. అందుకే.. ఎవ‌రు ఏ పార్టీ నేత‌లై నా.. సీమ‌వైపు ఎక్కువ‌గా దృష్టి పెడ‌తారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల కాలంలో బీజేపీ నేత‌లు ఇక్క‌డ పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. టీడీపీనుంచి బీజేపీలోకి వ‌చ్చిన సీఎం ర‌మేష్‌, ఆదినారాయ‌ణ రెడ్డి, వ‌ర‌దాపురం సూరివంటి నాయ‌కుల‌ను ప్రోత్స‌హించి.. ఇక్క‌డ చ‌క్రం తిప్పాల‌ని.. పార్టీ ప్ర‌య‌త్నిస్తోం ది.

ఈ క్ర‌మంలో.. రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా సీమ జిల్లాల్లో పార్టీ ప‌తాకాన్ని ఎగ‌రేసేందుకు ఉవ్వి ళ్లూరు తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న అనుస‌రిస్తున్న విధానాల‌పైనే తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎక్క డో పొరుగు రాష్ట్రాల్లో అనుస‌రించిన ఫార్ములాల‌ను ఇక్క‌డ ప్ర‌యోగించాల‌ని.. బీజేపీ ప్ర‌యత్నిస్తోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో పార్టీని పుంజుకునేలా చేసేందుకు.. మ‌త‌క‌ల‌హాల అంశాల‌ను... గ‌తంలో అనుస‌రించిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే.. అవి కొన్ని చోట్ల స‌క్సెస్ అయ్యాయి. చాలా చోట్ల బీజేపీకి మాయ‌ని మ‌చ్చ‌గా మారిపోయాయి.

ఇప్పుడు సీమ‌లోనూ ఇలాంటి ప్ర‌య‌త్న‌మే జ‌రిగిన‌ట్టు స్థానిక ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఇటీవ‌ల ఆత్మ‌కూరులో జ‌రిగిన ఘ‌ట‌న దీనికి అద్దం ప‌ట్టింద‌ని అంటున్నారు. ఒక ప్రార్థ‌నా మందిరాన్ని అడ్డుకు నేందుకు కీల‌క నేత రంగంలోకి దిగి... త‌ర్వాత‌. అది తీవ్ర వివాదం కావ‌డం. దీనిని అడ్డు పెట్టుకుని .. రాజకీయంగా ఏదో సాధించాల‌ని ప్ర‌య‌త్నించ‌డం... బీజేపీపై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింది. వాస్త‌వానికి వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ వివాదాలే త‌ప్ప‌.. సీమ ప్రాంతంలో ఇప్ప‌టి వ‌ర‌కు.. మ‌త క‌ల‌హాల‌కు చోటు లేదు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కూడా.. ఇక్క‌డ క‌ల‌సి క‌ట్టుగా ఉంటున్నారు.

కానీ, త‌మ‌కు అసలు పెద్ద‌గా ఎలాంటి దూకుడు లేని.. 0.1 శాతం ఓటు బ్యాంకు కూడా లేని.. సీమ‌లో మ‌త క‌ల‌హాల‌ను అడ్డు పెట్టుకుని ఎదిగేందుకు ప్ర‌య‌త్నించ‌డం... బీజేపీని రోడ్డుకు లాగింది. ఇక‌, ఇక్క‌డ పార్టీకి పెద్ద‌గా నాయ‌కులు లేరు. ఉన్నా కూడా వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉన్నారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో ఉన్న పార్టీ.. పుంజుకునేందుకు అనుస‌రించాల్సిన వ్యూహం ఏంటి?  అనేది ఆలోచించుకోకుండా.. కేవ లం.. ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం.. స‌మంజ‌స‌మేనా? అంటున్నారు స్థానికులు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టుమ‌ని ఓ వెయ్యి ఓట్లు కూడా సంపాయించుకోని పార్టీకి ఇంత మిడిసిపాటు ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News