తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య క్షరాలు.. సీఎం జగన్ సోదరి షర్మిలకు పెద్దగా రాజకీయ వర్గాల నుంచి మద్దతు లభించలేదు. అదేసమ యంలో మహిళల నుంచి కూడా ఎలాంటి సెంటిమెంటు స్టేట్‌మెంట్లు రాలేదు. మరీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి తనకు మద్దతు దక్కుతుందని ఇప్పటి వరకు వారు సైలెంట్ గా ఉన్నప్పటికీ ఈ వివాదంతో అయినా బయటకు వచ్చి తనకు సపోర్టు ఇస్తారని షర్మిల ఉహించారు.
కానీ, చిత్రంగా రెడ్డి వర్గం కానీ, గతంలో వైఎస్ అనుచరులుగా ఉన్నవారు కానీ, ఎవరూ స్పందించలేదు. షర్మిల ఇష్యూ అనండి.. ఎపిసోడ్ అనండి.. అనూహ్యంగా టీకప్పులో తుఫాను మాదిరిగా చల్లారిపోయింది. ఒకటి రెండు మీడియా సంస్థలు మినహా అది కూడా తమకు రేటింగ్ వస్తుందని భావించినవి మాత్రం కొద్ది సేపు హడావుడి చేశాయి. మిగిలిన టైమంతా వదిలేశాయి. ఇలా.. షర్మిల అనుకున్న మైలేజీ అయితే రాలేదని స్పష్టంగా తెలిసిపోయింది.
అయితే, ఇంతలోనే బీజేపీ నేతలు అనూహ్యంగా ఈ విషయంపై రియాక్ట్ కావడం గమనార్హం. కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్‌రెడ్డి అయ్యో.. అంటూ రియాక్ట్ అయ్యారు. షర్మిల మహిళ అని కూడా చూడకుండా టోయింగ్ వాహనంతో ఇలా ఆమె కారును నడిరోడ్డుపై తీసుకువెళ్తారా? ఇదేనా పాలన అంటూ ప్రశ్నించారు. ఇందులో కూడా బీజేపీ లబ్ధిని ఆయన చూసుకున్నా.. ప్రత్యక్షంగా షర్మిలను మాత్రం వెనుకేసుకువచ్చారు.
అయితే, కిషన్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నం.. షర్మిలకు మైలేజీ ఇవ్వకపోగా.. మరింతగా డ్యామేజీ చేశాయనే వాదన మాత్రం వినిపిస్తోంది. ఎలాగంటే.. బీజేపీ కనుసన్నల్లోనే ఆమె పార్టీ పెట్టారని, అసలు తెలంగాణతో సంబంధం లేని వ్యక్తి పార్టీ పెట్టడం వెనుక కేంద్ర బీజేపీ నేతల అడుగుజాడలు ఉన్నాయని ఒక ప్రచారం ఉంది. దీనిపై అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి.
ఇలాంటి సమయంలో కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని షర్మిలకు మద్దతుగా మాట్లాడడాన్ని.. బట్టి.. ఈ విషయం నిజమేనని అంటున్నారు పరిశీలకులు. నిజానికి వైఎస్ పెంచిన నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నా.. ఏ ఒక్కరూ మాట్లాడలేదు.
అలాంటి తమకు సంబంధం లేని ఒక పార్టీపై కిషన్ అంత సానుభూతి చూపించారంటే.. బీజీపీ వదిలిన బాణం గురితప్పిందనే ఆవేదనే అయి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి వీరిమధ్య బంధం బయట పడిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.