గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రత్యేక మేనిఫెస్టోలను తెరమీదకు తెస్తున్నాయి. భారతదేశంలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక స్థానం ఉండటం, గ్రేటర్ ఎన్నికలు అన్ని పార్టీలకు పెద్ద పరీక్షగా మారిన నేపథ్యంలో మేనిఫెస్టోలు ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ ఎస్ తన ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించగా...ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా తన మేనిఫెస్టోను వెల్లడించింది. తాగాజా బీజేపీ- టీడీపీ కూటమి సంయుక్త మేనిఫెస్టో విడుదల చేశాయి.
హ్యాపీ హైదరాబాద్ పేరుతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్ ను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో పాటు టీడీపీ, బీజేపీ ముఖ్యనేతలు విడుదల చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ లో పలు కీలకహామీలతో పాటు భవిష్యత్ కార్యాచరణను కూడా పేర్కొంది. ఇతర ప్రధాన పార్టీలకు తీసిపోని విధంగా హైదరాబాద్ ప్రజలకు హామీలు ఇచ్చారు.
ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా, పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. హైదరాబాద్ ను పూర్తి వైఫై నగరంగా మార్చడంతో పాటు ప్రతి ఇంటికి ఉచితంగా సెటప్ బాక్స్ లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. 200 గజాల్లోపు స్థలాల్లో నిర్మాణాలకు అనుమతులు ఉండాలన్న నిబంధనల రద్దు, పేదలకు వంద శాతం, మధ్య తరగతి వారికి 50 శాతం సబ్సిడీతో సోలార్ విద్యుత్ అందిస్తామని తెలిపింది. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తామని, ముఖ్యమైన కూడళ్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రతి డివిజన్‌లో మొబైల్ ఆస్పత్రులు ఏర్పాటుచేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని సంయుక్త మ్యానిఫెస్టోలో పేర్కొంది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమన్నారు. అవినీతి రహిత పాలన అందజేస్తామని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నిధులు దుర్వినియోగం కాకుండా పూర్తి స్థాయిలో వినిగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో నడిపించింది చంద్రబాబు అని గుర్తుచేశారు. ఇపుడు చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోడితో మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పారు.