తెలంగాణలో ఇప్పుడు సంకుల సమరం నడుస్తోంది. రెండు బలమైన పార్టీలు కొదమ సింహాల్లా పోరాడుతున్నాయి. కేంద్రంలో అధికార అండతో బీజేపీ.. రాష్ట్రంలో అధికారంతో బీఆర్ఎస్ నువ్వానేనా? అన్నట్టుగా తలపడుతున్నాయి. ఎవరూ వెనక్కి తగ్గకుండా ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు.. ఈ క్రమంలోనే కేసులు, అరెస్ట్ ల వరకూ ఈ వార్ సాగడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది..
-జాతీయ పార్టీతో వార్ షురూ చేసిన కేసీఆర్
బీజేపీ విధానాలు నచ్చకపోవడం.. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా సతాయిస్తుండడం.. తెలంగాణలో తనకు ప్రధాన పోటీగా మారిన బీజేపీని ఎదుర్కోవడానికి కేసీఆర్ జాతీయ పార్టీగా మార్చారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి కేంద్రంపై ఫైట్ కు దిగారు. జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించి బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రభుత్వ స్థాపన కోసం కష్టమైనా సరే శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. కేసీఆర్ తమకు పోటీగా రావడంతోనే బీజేపీ సైతం ఆయనపై ఫోకస్ చేసింది. కేసీఆర్ లూప్ హోల్స్ వెతికడం ప్రారంభించిందన్న చర్చ సాగింది.
-ఇక్కడ ఫాంహౌస్ కేసు.. అక్కడ ఢిల్లీ లిక్కర్ కేసు
తెలంగాణకు వచ్చి మరీ తన ప్రభుత్వాన్ని అస్తిరపరచడానికి ప్రయత్నించిన బీజేపీ ఏజెంట్లను పట్టుకొని జాతీయ స్థాయిలో కమలం పార్టీ పరువు తీశాడు కేసీఆర్. దాంతో రగిలిపోయిన బీజేపీ పెద్దలు ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయంపై ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఈడీ నోటీసులు జారీ చేసి ఆమెను విచారిస్తోంది. ఇలా ఇద్దరూ కేసులతో ప్రారంభమైన ఫైట్ ఇప్పుడు ముదిరిపాకాన పడింది..
-బండి సంజయ్ అరెస్ట్ తో వార్ షురూ
కవితను ఈడీ మూడు సార్లు విచారించడంతో కంగారుపడ్డ బీఆర్ఎస్ కు తెలంగాణలో టీఎస్.పీఎస్సీ, పదోతరగతి పేపర్ లీకేజీలు మరింత డ్యామేజ్ చేశాయి. అయితే ఈ పదోతరగతి పేపర్ లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ ను ఏ1గా నిర్ధారించిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో బీజేపీపై బీఆర్ఎస్ వార్ కొత్త మలుపు తిరిగింది. బండి సంజయ్ నే పేపర్ లీక్ ను ప్రోత్సహించారన్న అపవాదు బీజేపీపై పడడడంతో ఇది కొత్త మలుపు తిరిగింది.
-కవిత, కేసీఆర్ పై వీడియోతో బీజేపీ షాకిచ్చింది
ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ అరెస్ట్ తో కేంద్రంలోని బీజేపీ పెద్దలు యుద్ధానికి రెడీ అయ్యారు. తాజాగా బీజేపీ జాతీయ ట్విట్టర్ హ్యాండిల్స్ లో కేసీఆర్ అవినీతి, కవిత అరెస్ట్ ఖాయమంటూ ఓ కార్టూన్ వీడియోతో బీజేపీ హెచ్చరిస్తూ వీడియో పెట్టడం సంచలనమైంది.
ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే కేసులు, అరెస్ట్ లతోనే బీజేపీ, బీఆర్ఎస్ వార్ షురూ అయినట్టే కనిపిస్తోంది. ఎక్కడ రెండూ పార్టీలు తగ్గవని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ అరెస్ట్ కు బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటుందని.. ఇక కేసీఆర్ సైతం బీజేపీని వదిలిపెట్టకూడదని డిసైడ్ అయినట్టుగా పరిణామాలను బట్టి అర్థమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.