విమర్శలకు సమాధానం చెప్పాలనుకున్నారో.. గెలుపే ధ్యేయం అనుకున్నారో కానీ.. బీహార్ లో కమలనాథులు చేసిన తాజా ప్రకటనల సరికొత్త చర్చకు తెర తీసింది. ఎన్నికల వేళ.. ఓటర్లను తమ బుట్టలో వేసుకునేందుకు నోరూరించే తాయిలాల్ని ప్రకటించటం మామూలే. తాము కానీ ఎన్నికలోల విజయం సాధిస్తే.. సైకిళ్లు ఇస్తామని.. కలర్ టీవీలు ఇస్తామని ఊరించేవారు. ఆ జమానా పోయి.. ల్యాప్ టాప్ లు.. సెల్ ఫోన్లు.. మిక్సీలు.. గ్రైండర్లు లాంటి ఆఫర్లు ఇప్పటికే పలు పార్టీలు ప్రకటించాయి.
వీటన్నింటికి తలదన్నే ఆఫర్ ను ఈ మధ్యనే బీజేపీ ప్రకటించింది. తాము కానీ బీహార్ ఎన్నికల్లో గిలిస్తే.. పదో తరగతి మంచి మార్కులతో పాసైన విద్యార్థినులకు ఇంటర్ చదివే వారికి స్కూటీలు ఇస్తామని ప్రకటించింది. ఈ ప్రకటనపై పలువురు విస్మయాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో స్కూటీలనే తాయిలాలుగా ఇచ్చేస్తారా? అన్న ప్రశ్న వ్యక్తమైంది. అదే సమయంలో.. స్కూటీ సరే.. అందులో పెట్రోల్ మాటేమిటంటూ ప్రశ్నించారు.
ఈ లాజిక్ కూడా కరెక్టే అనుకున్నారేమో కానీ.. బీజీపీ నేతలు ఇప్పుడు మరింత అడ్వాన్స్ అయి.. స్కూటీ తో పాటు.. వాటికి అవసరమయ్యే ఉచిత పెట్రోల్ కూడా ఇస్తామని ప్రకటించారు. స్కూటీలు పొందే అర్హత ఉన్న వారికి.. రెండేళ్ల పాటు అందుకు అవసరమయ్యే పెట్రోల్ కూడా ఇస్తామని ప్రకటించి షాకిచ్చారు. గెలుపే ధ్యేయంగా సాగే పార్టీలకు అది.. ఇది అన్న తేడా ఏమీ ఉండదన్న విషయాన్ని బీజేపీ నాయకత్వం మరోసారి నిరూపిచనట్లైంది. మరి.. స్కూటీ ఆఫర్ తో వేడెక్కిపోయిన బీహార్ ఎన్నికల్లో.. తాజా పెట్రోల్ వరంతో.. మిగిలిన పార్టీలు మరెలాంటి తాయిలాలకు తెర తీస్తారో చూడాలి.