సార్వత్రిక ఎన్నికల్లో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎప్పుడు ఏ నేత నోటి నుంచి ఏ తరహా తూటా దూసుకువస్తుందో కూడా తెలియని పరిస్థితి. రాజకీయ ప్రత్యర్థులపై ఆయా నేతలు ఒకరికి మించి మరొకరు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తరహా సంస్కృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ - కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీలు మొదలెడితే... ఇప్పుడు చాలా పార్టీల నేతలు వారిని మించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వారిలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు ముందున్నారని చెప్పాలి. ఈ క్రమంలో ఇప్పుడు మోదీని టార్గెట్ చేస్తూ మాయావతి సంధించిన విమర్శ నిజంగానే వైరల్ గా మారిపోయిందని చెప్పాలి.
మోదీని చూసి బీజేపీలోని మహిళా నేతలందరికీ విడాకుల భయం పట్టుకుందని మాయావతి చేసిన వ్యాఖ్య పెను కలకలమే రేపుతోంది. అల్వార్ గ్యాంగ్ రేప్ పై అటు రాజస్థాన్ ప్రభుత్వం ఇటు నరేంద్ర మోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ మాయావతి తనదైన శైలి వ్యాఖ్యలు సంధించారు. ప్రస్తుతం బీజేపీలోని మహిళా నేతల భర్తలంతా మోదీ చుట్టూనే కనిపిస్తున్నారని - ఈ దృశ్యాలు చూసి ఆ మహిళా నేతలకు విడాకుల భయం పట్టుకుందని మాయావతి వ్యాఖ్యానించారు. తన స్వార్థ రాజకీయాల కోసం భార్యను వదిలేసి వచ్చిన మోదీ... తనతో భేటీ అవుతున్న బీజేపీ మహిళా నేతల భర్తలను తన మారిదే మార్చేస్తారేమోనని ఆమె సెటైర్ సంధించారు.
అసలు తమ భర్తలు నిత్యం మోదీ చుట్టూనే కనిపిస్తున్న తమ భర్తలను చూస్తున్న బీజేపీ మహిళా నేతలు... తమకు తమ భర్తలు ఎక్కడ విడాకులు ఇస్తారోనన్న భయంతో వణికిపోతున్నారని కూడా మాయావతి పేర్కొన్నారు. వివాహ బంధంపై మోదీకి ఉన్న అభిప్రాయం - కుటుంబం పట్ల ఆయనకున్న భావనలు... ఎక్కడ తమ భర్తలపై ప్రభావం చూపుతాయోనని కూడా బీజేపీ మహిళా నేతలు వణికిపోతున్నారని కూడా మాయావతి వ్యాఖ్యానించారు. మాయావతి వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలోనే పెను కలకలమే రేపుతున్నాయని చెప్పాలి. మరి మాయావతి కామెంట్లకు బీజేపీ నుంచి ఎలాంటి కౌంటర్లు దూసుకువస్తాయో చూడాలి.